Breaking News

రేవంత్, బాబుల మధ్య అదే చర్చ

Published on Sun, 03/10/2024 - 01:20

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబుతో రెండు గంటల పాటు బేగంపేట ఎయిర్‌ పోర్టులో చర్చలు జరిపారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. రేవంత్‌ను కలిసిన తర్వాతే చంద్రబాబు అమిత్‌ షాను కలిశారని వివరించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్‌ను బీజేపీ వైపు తీసుకొస్తానని చంద్రబాబు అమిత్‌ షాకు హామీ ఇచ్చారని ఆరోపించారు. రేవంత్‌కు  చంద్రబాబు ఎంత చెబితే అంతే అని వారు విశ్లేషించారు.

తెలంగాణ భవన్‌లో శనివారం మాజీ ఎమ్మెల్యేలు  బాల్క సుమన్‌ ,క్రాంతి కిరణ్, నన్నపనేని నరేందర్, బీఆర్‌ఎస్‌ నేతలు దేవీప్రసాద్, రాకేష్‌ కుమార్, గట్టు  రాంచందర్‌ రావు మీడియాతో మాట్లాడారు. మోదీ వద్ద బీజేపీ సీఎంలకు దొరకని ప్రాధాన్యత కాంగ్రెస్‌ సీఎం రేవంత్‌కు దొరుకుతోందని,  పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్‌ బీజేపీతో జత కట్టడం ఖాయంగా కనిపిస్తోందని బీఆర్‌ఎస్‌ నేతలు అభిప్రాయపడ్డారు. మోదీని రేవంత్‌ పెద్దన్నగా సంభోధించిన తర్వాత వారిద్దరి బంధం బలపడిందని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్‌ మరో ఏక్‌ నాథ్‌ షిండే, హిమంత్‌ బిశ్వశర్మగా మారుతారని ఆరోపించారు.

బాబు మాదిరిగానే రాష్ట్రంలో ఇప్పుడు మళ్లీ కరువు
చంద్రబాబు సీఎంగా ఉండగా తెలంగాణలో కరువు ఉండేదని, ఇప్పుడు చంద్రబాబు శిష్యుడు రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణలో మళ్ళీ కరువు వచ్చిందని వారు విమర్శించారు. రేవంత్‌ పత్రికల్లో ఇచ్చే అధికారిక ప్రకటనల్లో  ఇప్పటికే మార్పు వచ్చిందనీ, ఉపముఖ్యమంత్రి భట్టి ఫొటో ప్రకటనల్లో అదశ్యమయ్యిందన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్‌ ప్రకటనల్లో అమిత్‌ షా, చంద్రబాబు ఉంటారని ఆరోపించారు.

గతంలో చంద్రబాబు ఆదేశాల మేరకే తెలంగాణ ఉద్యమంపై రేవంత్‌ రైఫిల్‌ ఎక్కు పెట్టారని గుర్తు చేశారు. రేవంత్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నరేంద్రమోడీ చేతిలో పెడుతున్న తీరును కాంగ్రెస్‌ శ్రేణులు గమనించాలన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారుతుందని బీజేపీ నేతలు ఇస్తున్న ప్రకటనలు రేవంత్‌ను దష్టిలో పెట్టుకుని ఇస్తున్నవేనని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు, నేతలు ఆరోపించారు. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)