Breaking News

ఈడీ విచారణకు వెళ్తున్నా: కేటీఆర్‌

Published on Thu, 01/16/2025 - 01:17

సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా ఈ–కార్‌ రేసు కేసులో గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరు కానున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బుధవారం ప్రకటించారు. ఈ రేసు కోసం విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఫెమా ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు జరుపుతోంది. గురువారం ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. గతంలో విచారణకు పిలిచినప్పుడు కొంత సమయం కావాలని కేటీఆర్‌ కోరిన విషయం తెలిసిందే. 

ఆర్‌బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్‌ పౌండ్స్‌ రూపంలో నిధులు చెల్లించడంపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, హుడా మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ ఎన్‌ రెడ్డిలను ప్రశ్నించారు. నిధుల బదలాయింపునకు తానే ఆదేశించినట్లు కేటీఆర్‌ ఏసీబీ ముందు, బహిరంగంగా కూడా ప్రకటించారు. అయితే చెల్లింపులు ఏ విధంగా జరగాలి అనేది అధికారులు చూసుకుంటారని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్థిక శాఖ నుంచి కానీ కేబినెట్‌ ఆమోదం కానీ లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు మనీ లాండరింగ్‌ కిందకు వస్తుందన్నది ఈడీ వాదన. 

విచారణకు హాజరుకాక తప్పని పరిస్థితి
ఈడీ అధికారుల ముందు ఎలాంటి వాదన వినిపించాలన్నది కేటీఆర్‌ తన న్యాయవాదులతో చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచడానికి ప్రత్నించడం తప్ప.. తాను ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన వాదిస్తున్నారు. మంత్రిగా ఆదేశాలిచ్చింది తానే అయినా.. నియమ నిబంధనల మేరకు నిధుల బదలాయింపు ఎలా చేయాలన్న బాధ్యత అధికారులదేనని ఈడీ ముందు చెబుతారా? అనే అసక్తి నెలకొంది. ఏసీబీ కేసులో సుప్రీంకోర్టులో వేసిన క్వాష్‌ పిటిషన్‌ను కూడా వెనక్కు తీసుకోవాల్సి రావటంతో ఇక ఆయన విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. దీంతో ఈడీ విచారణపై బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

మరోసారి ఏసీబీ నోటీసులు..
కేటీఆర్‌ గురువారం ఈడీ ముందు హాజరైన తరువాత.. పరిణామాలను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్‌కు ఏసీబీ చెప్పిన నేపథ్యంలో.. విచారణకు రావాలని నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండోసారి విచారణకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)