Breaking News

సీఎం రేవంత్‌రెడ్డిది పర్సంటేజీ పాలన: కేటీఆర్‌

Published on Thu, 05/22/2025 - 05:52

నల్లగొండ టూటౌన్‌: ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రచారం చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ప్రభుత్వం కుట్ర పూరితంగా ఇచ్చే నోటీసులకు, విచారణలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. నల్లగొండ పట్టణంలో బుధవారం ఓ వివాహానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని, పర్సంటేజీల పాలన అని విమర్శించారు. 

కమీషన్లు ఇవ్వనిదే ఈ ప్రభుత్వంలో పనులు కావని స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలే బహిరంగ వేదికలపైనే చెబుతున్నారని అన్నారు. 20 శాతం, 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు రాష్ట్ర సచివాలయంలోనే ధర్నా చేశారని గుర్తుచేశారు. ఈ కమీషన్ల వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కమిషన్ల ఏర్పాటు, నోటీసులు అంటున్నారని ఎద్దేవా చేశారు. 

ఇది దద్దమ్మ ప్రభుత్వం: ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేదని కేటీఆర్‌ విమర్శించారు. ‘ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కూలిపోయి గురువారానికి మూడు నెలలు పూర్తవుతుంది. అందులో చనిపోయినవారి శవాలను కూడా తీసుకురాలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. సుంకిశాల రిటైనింగ్‌ వాల్‌ కూలిపోతే ఇప్పటివరకు విచారణ లేదు. అందుకు కారణమైన సంస్థపై చర్యలు లేవు. కాంగ్రెస్‌ వచ్చాక వట్టెం పంపుహౌస్‌ మునిగింది. పెద్దవాగు రెండుసార్లు కొట్టుకుపోయినా చర్యలు లేవు. 

కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా ప్రచారం చేస్తున్నా ప్రజలకు వాస్తవాలు తెలుసు. దేశంలో చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద తమకు సంపూర్ణ నమ్మకం ఉంది. ఎన్ని నోటీసులు ఇచ్చినా న్యాయం, ధర్మమే గెలుస్తుంది. తెలంగాణకు మేలు చేసినవారిని ఆ దేవుడే కాపాడుతాడు. ఎన్ని నోటీసులు ఇచ్చినా హామీలు అమలు చేసేంతవరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు’అని తేల్చి చెప్పారు. కేసీఆర్‌ వెంట మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)