Breaking News

ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం: హరీశ్‌రావు

Published on Thu, 07/18/2024 - 05:15

రామచంద్రాపురం (పటాన్‌చెరు): పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని భారతీనగర్‌ కార్పొరేటర్‌ సింధు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు తాము నిద్రపోమన్నారు. ఆ ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన బీఆర్‌ఎస్‌ పారీ్టకి నష్టం లేదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పని అయిపోయిందన్న వాళ్లు ఆ తరువాత అడ్రస్‌ లేకుండా పోయారన్నారు. 

గతంలో పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి అన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డే ఇప్పుడు ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టులో కేసు వేశామని తెలిపారు. దీనిపై త్వరలో సుప్రీం కోర్టుకు వెళ్లి పోరాడతామన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా అందుకు కార్య కర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. 

ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం రేషన్‌కార్డు ఆధారంగా రైతులకు రుణమాఫీ చేస్తామని ఉంటే, తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి పాస్‌బుక్‌ ఉంటే సరిపోతుందని నోటి మాటగా చెబుతున్నారన్నారు. ఆయన చెప్పిన మా టలనే జీవోగా తెచ్చి రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ నాయకులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి రావ డం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో ఐదేళ్లకు మించి ఏ రాష్ట్రంలో అధికారంలో లేద న్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలో కి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి పాల్గొన్నారు.

హరీశ్‌.. టీఆర్‌ఎస్‌  
టీఆర్‌ఎస్‌ కండువాతో మాజీమంత్రి హరీశ్‌రావు సందడి చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ కండువాతో హరీశ్‌ కనిపించడం చర్చనీయాంశమైంది. బీఆర్‌ఎస్‌ పేరును తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చే అవకాశం ఉందా? అని స్థానిక కార్యకర్తలు, స్థానికులు చర్చించుకుంటున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)