Breaking News

‘మేడిగడ్డలో రెండు పిల్లర్స్‌ కూలితే.. కాళేశ్వరమే కూలిపోయిందా?’

Published on Sat, 06/07/2025 - 11:30

సాక్షి, తెలంగాణభవన్‌: రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరంపై కాంగ్రెస్‌ నేతలు తప్పుడు ప్రచారం​ చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. మేడిగడ్డలో రెండు పిల్లర్స్‌ కూలితే కాళేశ్వరమే కూలిపోయిందని దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బనకచర్లపై కాంగ్రెస్‌ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లపై మాజీ మంత్రి హరీష్‌ రావు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే హరీష్‌ రావు మాట్లాడుతూ.. ‘నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్‌పై అభాండాలు వేస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క పిల్లర్‌ కుంగితే మేడిగడ్డ కొట్టుకుపోయినట్టుగా కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి. మేము చెప్పే విషయాలు నూటికి నూరుపాళ్లు నిజం. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ప్రచారం​ చేస్తున్నారు.

కాళేశ్వరం కూలిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కామన్‌ డైలాగ్‌ చెబుతున్నారు.  మేడిగడ్డలో 85 పిల్లర్స్‌ ఉంటే రెండు పిల్లర్సే కూలాయి. మేడిగడ్డలో రెండు పిల్లర్స్‌ కూలితే కాళేశ్వరమే కూలిపోయిందని దుష్ప్రచారం చేశారు. ​కానీ, బనకచర్లపై కాంగ్రెస్‌ నేతలు మాట్లాడటం లేదు. తెలంగాణలో కమీషన్ల పాలన సాగుతోంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

అంతకుముందు మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..‘దేశంలో ఏ మంత్రి పని చేయని విధంగా హరీష్ రావు అద్భుతంగా పనిచేశారు. తక్కువ కాలంలోనే ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత హరీష్ రావు గారిది. తెలంగాణ తెచ్చుకున్న నీళ్ళు నిధులు నియామకాలు టాగ్ లైన్ ఎప్పుడో పోయింది. నిందలు, దందాలు, చందాలు ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ పాలన. సుంకిశాల, slbc టన్నెల్ కూలినా.. కేంద్ర బృందం ఇప్పటివరకు రాలేదు. టన్నెల్ కూలిపోయి కూలీలు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

చిన్న పిల్లర్ మెడిగడ్డలో కూలితే దాన్ని రాద్దాంతం చేస్తోంది. గుజరాత్‌లో బ్రిడ్జ్ కూలి 140 మంది చనిపోతే.. ఏ రిపోర్ట్ ఉండదు.. బాధ్యులపై చర్యలు ఉండవు. బీహార్‌లో రోజుకో బ్రిడ్జి కూలిపోతే ఏ రిపోర్ట్ ఉండదు. కూలిన రెండు రోజుల్లోనే ndsa వచ్చింది.. పనికిమాలిన రిపోర్ట్ ఇచ్చింది. Ndsa రిపోర్ట్ బీజేపీ ఆఫీసులో తయారైంది. కాంగ్రెస్, బీజేపీ కుమక్కు రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ కమీషన్‌తో  కాంగ్రెస్ కేంద్ర పార్టీ కార్యాలయం నిర్మించారు. L and T సంస్థ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించింది. అదే సంస్థ మేడిగడ్డ బ్యారేజినీ నిర్మించింది. బనకచర్లతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు మాట్లాడటం లేదు అని అన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)