Breaking News

ఎట్ల చేద్దాం? అటు ఎర్రవల్లి ఫాంహౌస్‌కి బీఆర్‌ఎస్‌ లీడర్లు.. ఇటు బీజేఎల్పీ కీలక భేటీ

Published on Fri, 08/29/2025 - 11:40

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో ఇటు బీఆర్‌ఎస్‌, అటు బీజేపీలు కీలక సమావేశం నిర్వహిస్తున్నాయి.  

కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చించడమే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ సెషన్‌ను నిర్వహిస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే కాళేశ్వరం అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం కేసీఆర్‌ ఈ చర్చకు దూరంగా ఉంటారనే సంకేతాలు అందుతున్నాయి. ఈ తరుణంలోనే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఆయన కీలక నేతలతో భేటీ కాబోతున్నారు. 

అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ నేపథ్యంలో.. అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు సహా బీఆర్ఎస్ సీనియర్ నేతలు పాల్గొనబోతున్నారు. నివేదికపై చర్చించేందుకు తమకు తగినంత సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ భావిస్తోంది.

ఇక.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం నడుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై చర్చిస్తున్నారు. అయితే మీటింగ్‌ మధ్యలో ఎమ్మెల్యేల ప్రయారిటీ అంశాన్ని కొందరు చర్చకు తెచ్చినట్లు తెలుస్తోంది. కేడర్‌ తీవ్ర అసంతృప్తిలో ఉందని.. రాష్ట్ర కమిటీలో తాము ఇచ్చిన పేర్లను పరిశీలించాలని ఎమ్మెల్యేలు రాంచందర్ రావు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

కాళేశ్వరం కమిటీ నివేదికతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు తెలంగాణ అసెంబ్లీ రేపటి నుంచి ప్రత్యేకంగా భేటీ కానుంది. శనివారం ఉదయం 10.30గం.లకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు నివాళులర్పించిన అనంతరం సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఆపై బీఏసీ మీటింగ్‌ జరగనుంది. మధ్యాహ్నా సమయంలో సీఎం రేవంత్‌ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ భేటీ కానుంది. వీలును బట్టి.. నాలుగు లేదంటే ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)