Breaking News

పవన్‌.. మీరు ఉప్పు, కారం తినడం లేదా?

Published on Wed, 09/03/2025 - 17:05

సాక్షి,కాకినాడ: ఊగిపోయి మాట్లాడావు కదా.. ఇప్పుడు ఏమైంది నీ పౌరుషం పవన్‌ అని శాసన మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యానారాయణ ప్రశ్నించారు. కాకినాడలో బొత్స మీడియాతో మాట్లాడారు.

కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకునేవారే లేకుండాపోయారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక బస్తా యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. వ్యవసాయం దండగ,లాభంలేదని చంద్రబాబు బుర్రలో ఉంది. చంద్రబాబు అధికారంలో ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూరియా ఎందుకు దొరుకుంతుంది? కూటమి అధికారంలో ఉన్న ఏపీలో యూరియా ఎందుకు దొరకడం లేదు. 9వ తేదీన రైతు సంఘాలతో కలిసి ఉద్యమిస్తాం. ఆర్డీవో ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇస్తాం.

 32మంది బలిదానాలతో విశాఖ ఉక్కు పరిశ్రమ వచ్చింది. విశాఖ ఉక్కుపై ప్రజల్ని చైతన్య పరుస్తాం. విశాఖ ఉక్కుకోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. విశాఖ ఉక్కు గురించి సీఎం,డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడరు. పవన్‌ కల్యాణ్‌ ఉగిపోయి మాట్లాడావు కదా.. ఏమైందీ మీ పౌరుషం. ఎన్నికలకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్లు ఇప్పుడు ఏమయ్యారు. విశాఖ ఉక్కుపై ప్రభుత్వ భవిష్యత్తు కార్యచరణ ఏంటీ? పవన్‌.. మీరు ఉప్పు కారం తినడం లేదా?. ప్రధాని మోదీతో విశాఖ ఉక్కు గురించి చంద్రబాబు ఏం మాట్లాడారు. 15నెలల్లో కూటమి ప్రభుత్వం రూ.2లక్షల కోట్లు అప్పు చేసిందని’ వ్యాఖ్యానించారు.

కూటమి ప్రభుత్వంలో రైతులను పట్టించుకునేవారే లేకుండాపోయారు: బొత్స

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)