Breaking News

మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర

Published on Mon, 05/13/2024 - 04:10

విశాఖ సిటీ: టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఓటమి ఖాయమని తేలిపోవడంతో పోలింగ్‌కు ముందు రోజు చంద్రబాబు కొత్త కుట్రకు తెరతీశారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లు నకిలీ లేఖ సృష్టించారు. బొత్స లెటర్‌ హెడ్‌పైనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాస్తున్నట్లుగా లేఖను తయారు చేశారు. దాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ అధికార పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే  కుట్రకు తెరలేపారు. ఈ కుతంత్రంపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటమి భయంతో చంద్రబాబు ఇంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటువంటి నీచ రాజకీయాలు చంద్రబాబుకు అలవాటే అని మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.రవిశంకర్‌కు ఫిర్యాదు చేశారు. నకిలీ లేఖను సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

రోజుకో కుట్ర..
ఓటమి ముంగిట నిలిచిన చంద్రబాబు రోజుకో కుట్రతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన ప్రతి సంస్కరణ, నిర్ణయంలో లేని వివాదాలు సృష్టిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. భూ యజమానులకు మేలు చేసే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూశారు. అయినా ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్‌ చేశారు. ఆయన వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లు నకిలీ లేఖను సృష్టించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)