చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వ విధానాలను సమర్థిస్తున్నారా?: బొత్స

Published on Sat, 11/02/2024 - 12:16

విశాఖపట్నం, సాక్షి: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ విధానం ఏంటో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. శనివారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 

‘‘కేంద్ర మంత్రులు చెప్తున్నది వేరు.. క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది వేరు. స్టీల్ ప్లాంట్‌లో జరుగుతున్న తాజా పరిణామాలపై చంద్రబాబు వైఖరి ఏమిటి?. కేంద్ర ప్రభుత్వ విధానాలను బాబు సమర్థిస్తున్నారా?. ఈ ప్రాంత మనోభావాలను గౌరవించాలి. స్టీల్ ప్లాంట్ కోసం రాజకీయం చేయోద్దు. ఉమ్మడి ఆంధ్రుల హక్కు ఇది. చంద్రబాబు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్‌పై ద్వంద్వ వైఖరితో వెళ్తే ప్రజలు ఉపేక్షించరు. ఉన్న స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలి. ఇంకో స్టీల్ ప్లాంట్ వస్తే సంతోషమే. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కొనసాగాలి. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణపై ఒక్క నిర్ణయం కూడా జరగలేదు.

..పాల డైరీల చరిత్రలో ఎన్నడూ పాల సేకరణ ధర తగ్గించలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పాల సేకరణ ధర తగ్గించింది. చంద్రబాబు వెంటనే పాడి రైతులకు న్యాయం చెయ్యాలి. అమూల్ వచ్చాక రాష్ట్రంలో పాల సేకరణ ధర పెరిగింది. విశాఖ డెయిరీలో పాల సేకరణ ధర ఎందుకు తగ్గించారో సమాధానం చెప్పాలి. పాడి రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి.

మరోవైపు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. చట్టం ఒక పక్షం వహిస్తుంది. చట్టం నాలుగు పాదాలపై ఉండాలి. ఏకపక్షం వహించడం మంచిది కాదు. ఇసుక ఉచితం అని చెప్పి ప్రజలను మోసం చేశారు. గతంలో ఇసుక పాలసీ చాలా సులభంగా ఉండేది.నాడు విశాఖలో ఇసుక రూ రూ. 13వేలకు వచ్చేది.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)