Breaking News

‘ఖర్గేజీ.. అంతా హైకమాండ్‌ చేతుల్లోనే ఉందా?.. మీరు హైకమాండ్‌ కాదా?

Published on Mon, 06/30/2025 - 17:22

బెంగళూరు: కాంగ్రెస్‌లో హైకమాండ్‌ తీసుకునే నిర్ణయాలకే కట్టుబడి ఉండాలనేది ఎప్పట్నుంచో వస్తుంది.   రాష్ట్రాల్లో ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణంలొ అది హైకమాండ్‌ ఫైనల్‌ చేస్తుంది.  ఈ విషయంలో రాష్ట్ర సీఎంలు కూడా హైకమాండ్‌ మాటకు ఎదురుచెప్పకూడదు. ఈ తరహా పరిణామాలను తరుచూ చూస్తూనే ఉన్నాం.  మరి హైకమాండ్‌ అంటే ఎవరు?,  ఏఐసీసీ అధ్యక్షుడే కాంగ్రెస్‌ హైకమాండ్‌ కదా.. మరి పార్టీ చీఫ్‌ అయిన  మల్లిఖార్జున ఖర్గే నోట నుంచే హైకమాండ్‌ చూసుకుంటుంది అనే మాట వస్తే ఏమనాలి?

ఇప్పుడు అదే జరిగింది. ఏఐసీసీ ప్రెసిడెంట్‌ మల్లిఖార్జున  ఖర్గే.. ‘హైకమాండ్‌ చేతుల్లో ఉంది’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  కర్ణాటక రాజకీయాల్లొ ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా> సీఎంను మార్చబోతున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే ఒక్క ముక్కలో తెగ్గొట్టి చెప్పేశారు. అది హైకమాండ్‌ చేతుల్లో ఉంది అంటూ దాటవేత ధోరణి అవలంభించారు.  ఇది బీజేపీకి మంచి టానిక్‌లా దొరికింది. అటు కాంగ్రెస్‌ను, ఇటు ఖర్గేపై విమర్శలు చేయడానికి అవకాశం దొరికినట్లయ్యింది.  

ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సెటైర్లతో విరుచుపడ్డారు. ‘ ఇక్కడ హైకమాండ్‌ అంటే ఎవరు? మీరు కాదా?, కాంగ్రెస్‌ చీఫ్‌గా ఉన్న మీరు హైకమాండ్‌ కాదా?, మరి ఇంకా హైకమాండ్‌ ఎవరు? అని తేజస్వి సూర్య పంచ్‌లు వేశారు.   కాంగ్రెస్‌ హైకమాండ్‌ కనపడదు.. అది మనకు కనిపించదు.. వినిపించని దెయ్యంలా ఉంటుందేమో. మనం మాత్రం కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఉందని ఫీలవుతూ ఉండాలి’ అని సెటైరికల్‌ పంచ్‌లు విసిరారు.

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)