Breaking News

ఢిల్లీలో నో అపాయింట్మెంట్.. బాబు-పవన్‌ పడిగాపులు

Published on Fri, 03/08/2024 - 21:44

సాక్షి, ఢిల్లీ: బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తుపై హస్తిన వేదికగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ(శుక్రవారం) చంద్రబాబుకి బీజేపీ అగ్రనేత అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ దక్కలేదు. దీంతో గల్లా నివాసంలో బాబు,  అటు తాజ్‌మహల్‌ సింగ్ హోటల్‌లో పవన్ కల్యాణ్ పడిగాపులు కాస్తున్నారు. ఎలాగైనా సరే పొత్తు ఖరారు చేసుకోవాలని డిసైడ్‌ అయిన ఈ ఇద్దరూ ఈ రాత్రికి, రేపు.. అవసరమైతే ఎల్లుండి కూడా ఢిల్లీలోనే ఉంటారని సమాచారం.  

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా ప్రస్తుతం ఒడిషా, మహారాష్ట్ర పొత్తులకు సంబంధించిన చర్చలతో బిజీగా ఉన్నారు. అందుకే ఆయన చంద్రబాబుని పట్టించుకోలేదని తెలుస్తోంది. అంతేకాదు.. రేపు ఉదయం ఆయన పాట్నా(బీహార్‌) పర్యటనకు వెళ్లాల్సి ఉంది. దీంతో ఈలోపే చంద్రబాబు అమిత్‌ షాను కలుస్తారని టీడీపీ వర్గాలు ప్రకటనలు చేసుకుంటున్నాయి. అయితే షా కార్యాలయం మాత్రం చంద్రబాబుకి అపాయింట్‌మెంట్‌ ఖరారైనట్లు ప్రకటనేం చేయలేదు. మరోవైపు పవన్‌ ద్వారా అయినా కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సైతం ఫలించడం లేదని సమాచారం. 

ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక.. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీపడి ఇప్పుడు పొత్తు కోసం దేహి దేహి అంటున్నారు. అయితే బాబు రాజకీయం ఎరిగిన బీజేపీ.. ఏపీలో 9 ఎంపీ, 15 అసెంబ్లీ సీట్లు ఇస్తేనే పొత్తు ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ-జనసేన కూటమి తటపటాయిస్తోంది. 

ఇక.. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డ చంద్రబాబు.. 2018లో ప్రత్యేక హోదా కోసమే యేన్డీయే నుంచి బయటికి వచ్చానని ప్రగల్బాలు పలకడం గుర్తుండే ఉంటుంది. ఈ తరుణంలో.. కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్నా బాబు ఇప్పుడు ఎన్డీఏలో చేరడంలో మతలబు ఏంటి? ప్రశ్నిస్తున్నారు పలువురు. ఇది రాష్ట్ర ప్రయోజనామా ? సొంత పార్టీ ప్రయోజనామా ? అని నిలదీస్తున్నారు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)