Breaking News

దావోస్.. డెస్టినేషన్ మీటింగ్ అడ్డలా మారింది: రామచందర్‌ రావు

Published on Thu, 01/22/2026 - 14:35

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కావాలని బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ చీఫ్‌ రామచందర్‌ రావు. సింగరేణి నైనీ కోల్ బ్లాక్ టెండర్ల అవకతవకలపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నేతలు దావోస్‌ వెళ్లి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ తీరుపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించి నాలుగు నెలలు పూర్తి, అనుబంధ విభాగాల పనితీరుపై ఆయన సమీక్ష చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర కమిటీ పనితీరుపై రామచందర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం, రామచందర్‌ రావు మాట్లాడుతూ.. బీజేపీ అగ్రనేతలతో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒకటి చొప్పున ఐదు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నాం. జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ లాంటి వారి సభల కోసం బీఎల్ సంతోష్‌కి ప్రతిపాదనలు పంపాం అని అన్నారు.

ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ..‘సింగరేణి నైనీ కోల్‌ టెండర్ల విషయంలో రాష్ట్రం కోరితే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉంది. సీబీఐకి ఇస్తే 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరగాలన్నది బీజేపీ డిమాండ్. దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ లాస్ట్ టైం వెళ్లినప్పుడు తెచ్చిన పెట్టుబడులు ఎక్కడ పెట్టారో చూపెట్టాలి. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలి. దావోస్ వెళ్లి చేస్తున్నారు?. మంచు చూడటానికి వెళ్లారా?. దావోస్ డెస్టినేషన్ మీటింగ్ అడ్డలా మారింది. పెట్టుబడులు తేవడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైంది. రెండు దావోస్ పర్యటనల్లో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యం చెందాయి కాబట్టి ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)