Breaking News

‘ప్రియాంక రోడ్డు షో.. సీజనల్ ఫెస్టివల్ లాంటిది’

Published on Thu, 10/24/2024 - 12:36

తిరువనంతపురం: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్‌ అభ్యర్థి ప్రియాంకా గాంధీ వాద్రా నిర్వహించిన రోడ్డు షోకు భారీగా ప్రజలు తరలిరావటంపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ విమర్శలు గుప్పించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రియాంకా గాంధీ రోడ్డు షోకు త్రిసూర్‌తో సహా ఇతర జిల్లాల ప్రజలను తరలించారని అన్నారు. అందుకే భారీగా జనాలు వచ్చారని తెలిపారు.

‘‘షూటింగ్‌కు లేదా వయనాడ్‌లోని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తామని చెప్పి ప్రజలను ప్రియాంక గాంధీ రోడ్డు షోకు తీసుకొచ్చారు. రోడ్‌షోకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావటం వెనక కారణం ఇది. ప్రియాంక గాంధీ వయనాడ్‌కు రావటం, రోడ్‌షో నిర్వహించటం ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే వచ్చే ‘సీజనల్ ఫెస్టివల్’ లాంటిది. ప్రజలు అన్నీ గమనిస్తారు. 

...ప్రముఖ రాజకీయ కుటుంబ నేపథ్యం ఆధారంగా మాత్రమే ప్రియాంకా  గాంధీ అభ్యర్థి అయ్యారు. కానీ, నేను కార్పొరేషన్ కౌన్సిలర్‌గా  ప్రజల కోసం ఏళ్ల తరబడి పనిచేశా. అట్టడుగు స్థాయిలో పనిచేసి ప్రజాసేవలో అనుభవం సంపాదించా. ఒక అభ్యర్థి గొప్పతనానికి కుటుంబ ఆధిపత్యమే ప్రమాణమైతే.. దానికి నిదర్శనం ప్రియాంకా గాంధీ మాత్రమే. అయితే.. బీజేపీకి అలాంటి ప్రమాణాలు ఉండవు’’ అని అన్నారు. ఇక.. నవ్య హరిదాస్‌  ఇవాళ బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయనున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)