Breaking News

కొండా సురేఖపై ట్రోలింగ్.. రఘునందన్‌ సీరియస్‌

Published on Tue, 10/01/2024 - 16:47

మెదక్‌, సాక్షి: రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం ఏమాత్రం మంచిది కాదని.. బీఆర్‌ఎస్‌ పార్టీకి మహిళల మీద గౌరవం లేకుండా పోయిందని మండిపడ్డారు మెదక్‌ బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సోషల్‌ మీడియాలో నడిచిన ట్రోలింగ్‌ వ్యవహారంపై రఘునందన్‌ మీడియాతో మాట్లాడారు.

‘‘బీఆర్‌ఎస్‌కు మొదటి నుంచి మహిళల మీద గౌరవం లేదు. అందుకే.. తెలంగాణ తొలి కేబినెట్ లో మహిళలకు చోటు ఇవ్వలేదు. తల్లీ, అక్కాచెల్లి మధ్య ఉండే సంబంధం గురించి సోషల్ మీడియాలో సంస్కారహీనంగా పోస్టులు పెడుతున్నారు. ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేశా. ఇంతకు ముందు ప్రధాని మోదీ వచ్చినప్పుడు కూడా ఇలాగే నూలు పోగు దండను వేశా.  

.. మెదక్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా సురేఖ అక్క వస్తే చేనేత సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్లేలా నూలు పోగు దండ అడిగి వేశా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి నాకు శాలువా కూడా కప్పారు. కానీ, ఆ పార్టీకి చెందిన వాళ్లు ఇంత సంస్కారహీనంగా.. సభ్యత లేకుండా మాట్లాడతారని అనుకోలేదు.

.. అసలు బీఆర్‌ఎస్‌కు సోషల్‌ మీడియా మీద నియంత్రణ లేదా?. పోస్టు పెట్టిన అకౌంట్‌లో డీపీ హరీష్ రావు ఫోటో, కేసీఆర్‌ ఫోటోలు ఉన్నాయి.  కేటీఆర్, హరీష్ రావులు ఈ వ్యవహారంపై స్పందించి క్షమాపణలు చెప్పాలి. తమ సోషల్ మీడియా విభాగాలను కంట్రోల్ చేసుకోవాలి. పోస్టులు పెట్టిన వారు మీ వాళ్ళు అయితే తీసుకొచ్చి పోలీసులకి అప్పగించండి. మీకు సంబంధం లేని, మీరు జీతం ఇవ్వని వ్యక్తులు అయితే తీవ్రంగా పరిగణించండి. హరీష్ రావు ఫోటోలు వాడుకుంటున్నారు కదా.. అలాగైనా పోలీసు కంప్లయింట్ ఇవ్వండి.

.. నా వల్ల మా అక్కకు(కొండా సురేఖ) కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నా. ఒక అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తా’’ అని రఘునందన్‌ హెచ్చరించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)