Breaking News

బీసీలంటే రాహుల్‌కు ఎందుకంత చులకనా?: లక్ష్మణ్‌

Published on Thu, 11/02/2023 - 11:47

సాక్షి, ఢిల్లీ: బీసీ సీఎం చేస్తామన్న బీజేపీ ప్రకటనను రాహుల్ గాంధీ చులకన చేస్తున్నారని బీజేపీ ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌ మండిపడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీసీ వర్గాలను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పెత్తందార్ల మనస్తత్వంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ నేతలున్నారు.. ఆ పార్టీలను తెలంగాణ బీసీలు ఓటుతో తిప్పికొట్టాలన్నారు.

బీసీ సీఎం అయ్యేందుకు బీసీలంతా ఏకం కావాలి, తమ సత్తా చాటాలి. పార్లమెంట్ ఎన్నికల్లో మేము 4 సీట్లు సాధిస్తే, కాంగ్రెస్ 3కే పరిమితమైంది. తరతరాలుగా బీసీలను అణగదొక్కిన పార్టీ కాంగ్రెస్’’ అంటూ లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు.

బీజేపీ బీసీల అభిమానాన్ని చూరగొంది. అధికార పార్టీ బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తోంది. బీసీల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న ఎన్నికలు ఇవి. కొండంత ఆశతో బీసీలు మోదీ వైపు చూస్తున్నారు. డిపాజిట్లు గల్లంతైన పార్టీ కాంగ్రెస్‌. నిన్నటి సభలో రాహుల్‌ బీసీలను అవమానిస్తారా?. బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్‌. తక్షణమే రాహుల్‌ బీసీలకు క్షమాపణ చెప్పాలి. బీసీలంటే రాహుల్‌కు ఎందుకంత చులకనా?. బీసీల పట్ల కాంగ్రెస్‌ విపరీత ధోరణి మారాలి. ఎక్కడ ఎన్నిక జరిగినా కాంగ్రెస్‌ పునాదులు కదులుతున్నాయి. దేశ ప్రజలంతా ప్రధాని మోదీ వైపు చూస్తున్నారు’’ అని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.
చదవండి: కేసీఆర్‌ డిజైన్‌ చేస్తే ఇలాగే ఉంటుంది: రాహుల్‌ గాంధీ

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు