Breaking News

పొలిటికల్‌ హీట్‌.. ‘కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ కొంటున్నారు’

Published on Sun, 01/14/2024 - 12:48

సాక్షి, కరీంనగర్‌: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాజీ సీఎం కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నారని బండి సంజయ్‌ కామెంట్స్‌ చేశారు. 

ఇక, తాజాగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ టచ్‌లో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కేసీఆర్‌ కోవర్టున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాతే ఏదైనా జరగొచ్చు. కోవర్టులకు గత ఎన్నికల్లో కేసీఆర్‌ భారీగా డబ్బులు ఇచ్చారు. తెలంగాణ కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సహకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. 

బీఆర్‌ఎస్‌ అంటే కూల్చే పార్టీ.. బీజేపీ అంటే నిర్మించే పార్టీ. భద్రాద్రి ఆలయానికి వచ్చి తలంబ్రాలు తీసుకురాలేనోళ్లు బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పోటీ చేయడం లేదు?. తెలంగాణలోనే ఆ పార్టీకి అభ్యర్థులు దిక్కులేరు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో ఉండాల్సింది మోదీ సర్కారే. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తేనే తెలంగాణకు అధిక నిధులు వస్తాయి’ అని కామెంట్స్‌ చేశారు. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)