బ్యాగుల తనిఖీ: ఉద్ధవ్‌ ఠాక్రేకు బీజేపీ కౌంటర్‌

Published on Wed, 11/13/2024 - 10:47

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బ్యాగులు తనిఖీ చేయటం మహారాష్ట్రలో రాజకీయంగా చర్చనీయాంశం అయింది. సోమవారం యావత్మాల్‌లో జిల్లాలో ఎన్నికల ప్రచారానికి  వెళ్లిన శివసేన(యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రే బ్యాగులను ఎన్నికల అధికారలు సోదా చేయటం వివాదం రేపింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాల లగేజీని ఎన్నికల అధికారులు ఇలాగే తనిఖీ చేస్తారా? అని నిలదీశారు. అయితే దీనిపై బీజేపీ కౌంటర్‌ ఇచ్చింది.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బ్యాగ్‌లను కూడా విమానాశ్రయ అధికారులు అదే విధంగా తనిఖీ చేసిన వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. కొందరు నాయకులకు ప్రదర్శనలు ఇవ్వడం అలవాటని పేర్కొంది. ‘‘రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకువెళ్లడం మాత్రమే సరిపోదు. రాజ్యాంగ ప్రక్రియలను కూడా గౌరవించాలి. ప్రతి ఒక్కరూ గౌరవ భావాన్ని కలిగి ఉండాలని మేం కోరుతున్నాం’’ అని బీజేపీ తెలిపింది. ఇక.. నవంబర్ 5న కొల్హాపూర్ విమానాశ్రయంలో ఫడ్నవీస్ బ్యాగ్‌ని అధికారులు తనిఖీ చేశారు.

మరోవైపు.. ఉద్ధవ్‌ ఠాక్రే బ్యాగు తనికీ చేయటంపై ఎన్నికల కమిషన్‌ స్పందించింది. ఎన్నికలవేళ ప్రామాణిక నియమావళి(ఎస్‌ఓపీ) మేరకే వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతలు ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్లలో తనిఖీలు చేపడుతున్నట్లు ఈసీ వివరించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)