Breaking News

మళ్లీ బీజేపీలోకి భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్.. ‘టిక్కెట్‌’ కోసం భేటీలు

Published on Tue, 09/30/2025 - 15:51

న్యూఢిల్లీ: భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఆయన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ)చీఫ్ ఉపేంద్ర కుష్వాహా, బీజేపీ సీనియర్ నేత వినోద్ తవ్డేలతో దేశ రాజధాని ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇది బీహార్‌ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసింది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన తవ్డే.. పవన్ సింగ్ బీజేపీలోనే ఉంటారని ధృవీకరించారు. ఆయన ఉపేంద్ర కుష్వాహా నుండి ఆశీస్సులు పొందారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీలో చురుకుగా పని చేస్తారన్నారు.

బీహార్ ఎన్నికలకు ముందు భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ బీజేపీ నేతలను కలుసుకోవడం కీలక పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భోజ్‌పురి మాట్లాడే ఓటర్లలో ఆయనకు ఎంతో ఆదరణ ఉంది.ఈ పరిణామం బీజేపీ నేతలను, కార్యకర్తలను ఉత్సాహ పరుస్తుందని, పార్టీ ప్రచారానికి కొత్త ఊపు వస్తుందని పలువురు భావిస్తున్నారు. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో కరకట్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పవన్ సింగ్ బరిలోకి దిగడం ఉపేంద్ర కుష్వాహా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిందంటారు. రాజ్‌పుత్ వర్గం కుష్వాహాకు మద్దతు ఇవ్వలేదని, ఇది సమీప నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపిందని విశ్లేషకులు చెబుతుంటారు. ఫలితంగా షహాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాలలో బీజేపీకి గణనీయమైన నష్టం వాటిల్లిందని అంటారు.

భోజ్‌పురి నటుడు పవన్ సింగ్  2024లో మొదటిసారిగా పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నుండి పోటీకి నిలిపారు. అయితే అతను తన మ్యూజిక్ వీడియో పాటల్లో బెంగాలీ మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించారనే ఆరోపణలుతో పార్టీ అతన్ని పోటీ నుంచి ఉపసంహరించుకోవాలని కోరింది. దీంతో ఆయన కరకట్ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.  ఇది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కొన్ని సీట్లను కోల్పోయేలా చేసింది.

బీహార్‌లోని మొత్తం 243 నియోజకవర్గాలకు శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఇంకా తేదీలను ప్రకటించలేదు. మునుపటి అసెంబ్లీ ఎన్నికలు 2020 అక్టోబర్-నవంబర్‌లో జరిగాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. 2022, ఆగస్టులో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) ఎన్డీఏతో సంబంధాలను తెంచుకుని, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌ బంధన్‌ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం 2024, జనవరిలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌ బంధన్‌తో సంబంధాలను తెంచుకుని, తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)