Breaking News

బాబు జిమ్మిక్కులు నమ్మం

Published on Sat, 03/09/2024 - 03:48

సాక్షి, అమరావతి: ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటక బోడి మల్లన్న అన్నట్లుగా.. ఎన్నికల్లో అవకాశవాదంతో వ్యవహరించే చంద్రబాబును నమ్మేదిలేదని బీసీలు కుండబద్దలు కొడుతున్నారు. ఎన్నికలు వచ్చి న ప్రతిసారి బీసీలే టీడీపీకి వెన్నెముక అని వారిని మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తమను కరివేపాకులా తీసిపారేస్తున్నాడని మండిపడుతున్నారు. 2014 ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్‌ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే తమను మోసగించిన తీరును బీసీ నేతలు గుర్తుచేస్తున్నారు.

అలాగే, 2019 ఎన్నికల ముందు కూడా బీసీలకు 119 హామీలను ఇచ్చి న చంద్రబాబు ఐదేళ్లలో ఒక్క హామీనీ సరిగ్గా అమలుచేయలేదన్నారు. ఇక 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరిన బీసీలను ‘ఏం తమాషాలు చేస్తున్నారా.. పిచ్చాటలు ఆడారంటే మీ తోకలు కత్తిరిస్తా.. మీ తాట తీస్తా’.. అంటూ వేలు చూపించి బెదిరించడంతోపాటు మత్స్యకారులపై కేసులు పెట్టిన చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోయేదిలేదని బీసీ నేతలు స్పష్టంచేస్తున్నారు.

ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు ఇస్తానని ప్రకటించిన చంద్రబాబు కనీసం సగం సీట్లు కూడా ఇవ్వకుండా దగా చేసిన తీరును వారు మరిచిపోలేదు. ఏడాదికి రూ.10వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.50వేల కోట్లు బీసీ సబ్‌ప్లాన్‌కు కేటాయిస్తానని అప్పట్లో హామీ ఇచ్చి న చంద్రబాబు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. నిధుల కేటాయింపులో దగా చేయ­డమే కాకుండా పదవుల కేటాయింపులోను చంద్రబాబు బీసీలను తీవ్రమోసం చేశాడని వాపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వెనుకబడిన తరగతులను మరోమారు బురిడీ కొట్టించేందుకు ఆయన చేస్తున్న జిమ్మిక్కులను నమ్మేదిలేదని తెగేసి చెబుతున్నారు.

జగన్‌ను చూసి బాబు నేర్చుకోవాలి 
రాజకీయాల్లో 42 ఏళ్ల అనుభవం, 14 ఏళ్లపాటు సీఎంగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబు యువకుడైన సీఎం జగన్‌ను చూసి చాలా నేర్చుకోవాలి. అధికా­రంలో ఉన్న రాజకీయ నాయకుడికి ప్రజలను ఆదుకుని అండగా నిలవాలనే మనస్సు ఉండాలి. అటువంటి మంచి మనస్సు జగన్‌కు ఉంది. చంద్రబాబుకు పేదల గురించి ఆలోచించే మనస్సు ఏ కోశానా లేదు. చంద్రబాబు సంక్షేమ పథకాలకు తన సొంత సొమ్ము ఇచ్చి నట్లు ఫీలవుతాడు.

అలాంటి చంద్రబాబు ఇప్పుడు బీసీ డిక్ల­రేషన్‌ పేరుతో బీసీలకు మేలు చేస్తా­నని చెప్పడం హాస్యాస్పదం. 2014లో చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ ఎంతమేరకు అమలు చేశారో? గమనిస్తే చాలు ఆయన చిత్తశుద్ధి తెలిసిపోతుంది. తాజాగా టీడీపీ ప్రకటించిన డిక్లరేష­న్‌లో ఎట్రాసిటీ యాక్ట్‌ తప్ప మిగతావన్నీ ప్రస్తు­తం సీఎం జగన్‌ అమలుచేస్తున్నవే. సామాజిక న్యా­యం అమలులో సీఎం జగన్‌కు ఎవరూ సాటిరారు.  – డాక్టర్‌ ఎన్‌వీ రావు, జాతీయ అధ్యక్షుడు, బీసీ ఇంటర్నేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌

నయవంచకులు బాబు.. పవన్‌లను నమ్మం 
చంద్రబాబు, పవన్‌లు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ నేతి బీర చందంగా ఉంది. గత డిక్లరేషన్‌నే అటకెక్కించిన నయ­వంచక బాబు, పవన్‌­ఇప్పుడు మళ్లీ డిక్లరేషన్‌ అంటే బీసీ­లు నమ్మరు. వారి పట్ల బాబు, పవన్‌లకు చిత్తశుద్ధిలేదని తాజాగా ప్రకటించిన ఎమ్మెల్యే టికెట్లు తేటతెల్లం చేస్తున్నాయి. అంబేడ్కర్, జ్యోతి­రావు ఫూలే ఆశయాలు, ఆలోచనలను అమలుచేస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్‌. గతంలో బీసీ డిక్లరేషన్‌లో చెప్పింది చెప్పినట్లు­గా అమలుచేసి చూపించిన సీఎం జగన్‌ రాష్ట్రం­లోని బీసీలను వెన్నెముక వర్గాలుగా తీర్చిదిద్దారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 33% రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు వేయించి బాబు ద్రోహం చేస్తే.. అంతకంటే ఎక్కువ పదవులు దక్కేలా చేసిన సీఎం జగన్‌ బీసీల పక్షపాతిగా మన్ననలు అందుకున్నారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పా­టుచేశారు. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు­­చేసి వారి ఉన్నతికి సీఎం జగన్‌ చర్యలు చేపట్టారు.   – చింతపల్లి గురుప్రసాద్, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్, బీసీ కులాల జేఏసీ

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)