Breaking News

మా టార్గెట్‌ పాతబస్తీ...

Published on Sun, 09/01/2024 - 04:19

నయీంనగర్‌ (హనుమకొండ): ‘మా టార్గెట్‌ పాతబస్తీ. ఓల్డ్‌ సిటీని న్యూ సిటీగా మార్చాలని పోరాడుతున్నాం... ఎంఐఎం ఆనవాళ్లు లేకుండా చేస్తాం. పాతబస్తీని కైవసం చేసుకోవడమే బీజేపీ లక్ష్యం’అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ అన్నారు. సంఘ విద్రోహులకు అడ్డాగా మారిన పాతబస్తీని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామనే విషయాన్ని మైనారిటీ మోర్చా నాయకులంతా ముస్లింలకు వివరించాలని సూచించారు. 

హనుమకొండలో శనివారం జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధాలు, మోసాలు చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ కేసీఆర్‌ను మించిపోయిందన్నారు. ‘వెయ్యి ఎకరాల్లో జూ ఏర్పాటు చేస్తారట. మరో వెయ్యి ఎకరాల్లో హెల్త్‌ హబ్‌ ఏర్పాటు చేస్తారట. వేలాది ఎకరాల్లో ఫోర్త్‌ సిటీని నిర్మిస్తారట. అసలు ఉన్న భూములన్నీ కేసీఆర్‌ అమ్ముకున్నడు... మరి ఈ ప్రభుత్వం యాడ నుండి తీసుకొస్తది.?’అని ప్రశ్నించారు. 

బీఆర్‌ఎస్‌ పాలనలో బీజేపీ కార్యకర్తలపై చేసిన అరాచకాలను మర్చిపోలేమని, బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికే కేసీఆర్‌ కుటుంబాన్ని జైల్లో వేసే వాళ్లమని చెప్పారు. రాక్షస పార్టీ బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, ఇదంతా కాంగ్రెస్‌ చేస్తున్న తప్పుడు ప్రచారమన్నారు. కాంగ్రెస్‌లోనే బీఆర్‌ఎస్‌ విలీనం ఖాయమని, మాట ముచ్చట కూడా పూర్తయ్యిందని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)