Breaking News

ఆరు గ్యారంటీలను మరిపించేందుకే ‘హైడ్రా’: బండి సంజయ్‌

Published on Fri, 08/30/2024 - 04:30

సిరిసిల్ల: ఆరు గ్యారంటీలను మరిచిపోయేందుకు హైడ్రా తెచ్చారని, ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట, సిరిసిల్లలో గురువారం పర్యటించిన సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జన్వాడ ఫామ్‌హౌ స్‌ నిర్మాణం కూల్చివేతలో రేవంత్‌ రోషం ఏమైందని ప్రశ్నించారు. 

సల్కం చెరువు ఆక్రమణలపై ఒవైసీ బెదిరిస్తే భయపడతావా? అని ముఖ్యమంత్రిని బండి ప్రశ్నించారు. విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఒవైసీ అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని చెప్పారు. రైతు రుణమాఫీ బోగస్‌ అని, రైతు భరోసా లేదని, మహిళలను  ప్రభుత్వం ఆదుకోలేదని, నోటిఫికేషన్లు ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు యువరాజు అమెరికా వెళ్లాడని, ఆయన్ని కలిసేందుకు కాంగ్రెస్‌ నేతలు వెళ్తున్నారని, ఆ రెండు పార్టీల విలీనం ఖరారు అయిందన్నారు. 

ప్రభుత్వ విధానాలతో నేతన్నలు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బండి సంజయ్‌ విమర్శించారు. సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా దాట వేస్తోందన్నారు . రూ.లక్షల విద్యుత్‌ బకాయిలతో నేతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారని, ఈ  సమస్యకు పరిష్కారంపై సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తానని బండి సంజయ్‌ అన్నారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)