Breaking News

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్‌లో ఉన్నారు: బండి సంజయ్‌

Published on Fri, 02/16/2024 - 14:47

సాక్షి, హైదరాబాద్‌: ఎనిమిది మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఐదుగురు ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌. శుక్రవారం మీడియాతో ఆయన చిట్‌చాట్‌ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌తో మాకు పొత్తు లేదు. కేసీఆర్‌ డ్రామా ఆడుతున్నారు. మోదీ.. అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడే ఎన్‌డీఏలో బీఆర్‌ఎస్‌ను చేర్చుకొలేదు. ఎటుకాని బీఆర్‌ఎస్‌ను పార్టీని ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటాం. ఉన్న బీఆర్‌ఎస్‌ సిట్టింగ్ ఎంపీలు పక్క దారులు చూసుకుంటున్నారు. పొత్తులు అనేది కేసీఆర్ సృష్టి’’ అంటూ బండి సంజయ్‌ పేర్కొన్నారు.

గొర్రెలు, కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ముందు బీజేపీ నేతలు వెళ్లి చూశారు.. సెంట్రల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి ఫిర్యాదు చేశాం. రిపోర్ట్ కూడా ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు పనికిరాదని సెంట్రల్ డ్యాం సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టడం లేదు’’ అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

కాళేశ్వరంలో జరిగిన లక్ష కోట్ల అవినీతి సొమ్ము ఎలా రాబడతారు?. కాంగ్రెస్ కాళేశ్వరం అవినీతి పై మాట్లాడుతుంది. బీఆర్‌ఎస్‌ కేఆర్‌ఎంబీపై మాట్లాడుతుంది. మాకు రాముడు, మోదీ ఉన్నారు. రజాకార్లు, ఎంఐఎం పార్టీలు..  కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ వైపు ఉన్నారు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ లో కాంగ్రెస్ - బీజేపీ మధ్యే పోటీ. దొంగ ఓట్లను తొలగిస్తే హైదరాబాద్ పార్లమెంట్‌లో కూడా గెలుస్తాం. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే... కాంగ్రెస్ పార్టీ నుంచి షిండేలు వస్తారు’’ అంటూ బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: పని చేయలేని వాళ్లు తప్పుకోండి 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)