Breaking News

అప్పుడే రాహుల్ రాష్ట్రంలో అడుగు పెట్టాలి: బండి సంజయ్‌ సవాల్‌

Published on Tue, 11/05/2024 - 18:34

సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణలో రాహుల్‌ గాంధీ పర్యటనపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాకే తెలంగాణలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఎన్నో హామీలు ఇచ్చారన్న సంజయ్.. వాటిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉందన్నారు. మంగళవారం సిరిసిల్లా జిల్లా రుద్రంగిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెంట్రల్ లైబ్రరీకి, యూనివర్సిటీకి వెళ్లి మరీ యువతకు రాహుల్ గాంధీ హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. మహిళలు, రైతులతో పాటు అన్ని వర్గాల వారికీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చారన్నారు. ఇక్కడ ఆరు గ్యారంటీలు, ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండానే మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణాలో అన్నీ చేసినట్టు  కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోందని మండిపడ్డారు. ఏ గ్యారంటీలు అమలు చేశారో ముందు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర డబ్బంతా తీసుకెళ్లి మహారాష్ట్రలో యాడ్స్ ఇస్తోందని ఆరోపించారు బండి సంజయ్‌. గతంలో కేసీఆర్ కూడా ఇక్కడి రైతులను ఎండబెట్టి పంజాబ్ రైతులకు ఇక్కడి డబ్బులిచ్చాడని విమర్శలు గుప్పించారు.  ‘స్వయానా వ్యవసాయశాాఖ మంత్రే ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదని చెప్పారు. ఆ విషయాన్ని అక్కడి యాడ్స్ లో ఎందుకు పేర్కొనలేదు..? ఆరు గ్యారంటీలు, ఇచ్చిన హామీలు ఏవి అమలు చేశారో చెప్పాకే రాహూల్ గాంధీ రాష్ట్రంలో అడుగు పెట్టాలి.

దమ్ముంటే ఇప్పుడు రాహూల్ గాంధీ తెలంగాణాలో పాదయాత్ర చేయాలి. లక్షా యాభై వేల కోట్ల మూసీ ప్రాజెక్ట్ ఓ పెద్ద స్కామ్. కాంగ్రెస్ అధినేత్రి అల్లుడికి కట్టబెట్టేందుకు జరుగుతున్న ఓ పెద్ద స్కీమ్. దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. సర్పంచుల సమస్యలకు కారణమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్లీ బీఆర్ఎస్సే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామనడం హాస్యాస్పదం. సర్పంచులను మోసం చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ దొందూ దొందే’ అని మండిపడ్డారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)