Breaking News

అసత్య ప్రచారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ బాబే

Published on Mon, 01/22/2024 - 04:58

సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు కొంచెం కూడా మేలు చేయలేదని.. అలాంటి వ్యక్తిని గిరిజనులు ఎప్ప­టికీ నమ్మరని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. చంద్రబాబు అరకులో సభ పెట్టి వైఎస్సార్‌సీపీపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు గిరిజనులకు సెంటు భూమైనా ఇచ్చాడా? అసత్య ప్రచారానికి ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌. చంద్రబాబు గిరి­జన ద్రోహి అయితే సీఎం జగన్‌ గిరిజన బంధువు.

బాబు తన హయాంలో గిరిజన శాఖకు మంత్రిని కూడా పెట్టలేదు. అలాంటి బాబు అరకులో గిరిజనులపై ప్రేమ నటిస్తు­న్నారు. గిరిజనులకు పోడు భూములను పంచిపెట్టిన ఘనత సీఎం జగన్‌దే. చంద్రబాబూ ఎందుకు సెంటు భూమి కూడా ఇవ్వలేకపోయారో చెప్పాలి. గిరిజనులకు బుద్ధిలేదు అంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. అందుకే ఈ రాష్ట్రంలోని ఏడు గిరిజన అసెంబ్లీ, ఒక పార్లమెంటును వైఎస్సార్సీపీకి కట్టబెట్టారు. రాబోయే ఎన్నికల్లో కూడా టీడీపీకి ఇదే గతిపడుతుంది.     

బాబుకు ఈ ఆలోచనలు ఎందుకు రాలేదు? 
రాష్ట్రంలో 38 లక్షల మంది గిరిజనులు తమకు ప్రత్యేకమైన గిరిజన కమిషన్‌ కావాలని అడిగితే,  చంద్రబాబు ఆ ఆలోచన కూడా చేయలేదు. అదే జగన్‌ సీఎం అయిన వెంటనే గిరిజన కమిషన్‌ ఏర్పాటుచేసి మా హక్కులకు భరోసా కల్పించారు. దేశ చరిత్రలో ఏ సీఎంకి రాని అద్భుతమైన ఆలోచనతో గిరిజన ప్రాంతంలో ట్రైబల్‌ యూనివర్సిటీ, మెడికల్‌ కాలేజీ, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఇంజనీరింగ్‌ కాలేజీ నిర్మాణం చేపట్టారు.

చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయాలనిపించలేదు?  చంద్రబాబు ఇప్పుడొచ్చి ఎన్నెన్నో మాటలు మాట్లాడితే ప్రజ­లు నమ్ముతారు అనుకుంటే పొరపాటే. విశాఖను పరిపాలన రాజధాని చేస్తానంటే దాన్ని కూడా చంద్రబాబు విమర్శిస్తున్నారు. అలాగే, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గంజాయి సాగును విపరీతంగా ప్రోత్సహించారు. అదే సీఎం జగన్‌ ఆ సాగును అరికట్టడమే కాక వారికి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించారు. ఎమ్మెల్యేలపై చంద్రబాబు వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)