నాదెండ్ల మనోహర్‌పై నీళ్ల బాటిల్‌తో దాడి

Published on Fri, 03/08/2024 - 08:07

తెనాలి(గుంటూరు జిల్లా): పొత్తు పెట్టుకున్నప్పటికీ  తెనాలిలో టీడీపీ–జనసేన నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న తీవ్ర విభే­దాలు గురువారం బట్ట­బయ­లయ్యాయి. జనసేన సీనియర్‌ నేత, తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌పై టీడీపీ వర్గీయులు నీళ్ల బాటిల్‌తో దాడి చేశారు. ఈ బాటిల్‌ ఆయన తలకు తగిలింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనో­హర్‌ గురువారం సాయంత్రం తెనాలిలో జనచైతన్య పాదయాత్ర ప్రారంభించారు. బోసు రోడ్డు­లోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వీనస్‌ టాకీస్‌ దగ్గరకు చేరుకుంది. అక్కడ టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ (రాజా) వచ్చి కలిశారు.

ఆ వెంటనే రాజాకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు, నాయ­కులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోటీగా జనసేన కార్య­కర్తలు నాదెండ్ల మనోహర్‌ జిందాబాద్‌.. అంటూ నినాదాలు ప్రారంభించారు. దీంతో అక్కడ తో­పు­లాట జరిగింది. ఈ తోపులాటలో టీడీపీ మహిళా కార్యకర్త ఒకరు ఇరుక్కు­పోయారు. ఈ సమయంలో∙ఎవరో నీళ్ల బాటి­ల్‌ను నాదెండ్ల మనోహర్‌పైకి బలంగా విసిరారు.

ఆయన తప్పుకోవా­లని ప్రయత్నించినప్పటికీ తలకు తగిలింది. ఈ ఘటనతో అందరూ కంగుతిన్నారు. ఆలపాటి రాజా వర్గమే అక్కసుతో ఈ దాడికి పాల్పడిందని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆలపాటి రాజా టీడీపీ నుంచి తెనాలి టికెట్‌ ఆశించారని, ఆయనకు కాకుండా పొత్తుల్లో భాగంగా జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు ఇవ్వడంవల్లే ఈ దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలతో పాదయాత్రకు వచ్చిన అనేక మంది యాత్ర పూర్తికాకుండానే వెళ్లిపోయారు. 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)