Breaking News

కష్టాలు పవన్ ఖాతాలో.. సుఖాలు లోకేష్‌​కు

Published on Sun, 03/30/2025 - 16:03

అమరావతిలో ఎప్పట్లానే ఉగాది ఆస్థానం ఏర్పాటు చేసారు... గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే చంద్రబాబు.. లోకేష్.. మంత్రులు మాత్రమే ఉండేవాళ్ళు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం ఆస్థానంలో పాల్గొన్నారు.  పంచాంగకర్త మాడుగుల నాగఫణి శర్మ.. గతంలో మాంచి ఫామ్‌లో ఉంటూ.. కొన్ని అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుని ఫేడ్ అవుట్ అయిన మాడుగుల నాగఫణి శర్మ పంచాంగం చదూతున్నారు. లోలోన పవన్ లోకేష్ ఇద్దరూ టెన్షన్ టెన్షన్ అవుతున్నారు.. మాకు ఎలా ఉంటుంది.. ఏమై ఉంటుంది.. భవిష్యత్ బంగారమే కదా అంటూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. నాగబాబు కూడా కొత్త కండువా మాటికీ సర్దుకుంటూ మేధావి నవ్వు నవ్వుతూ అటూ ఇటూ చూస్తున్నాడు. అసలు ఉగాది పండగను కనిపెట్టి.. తెలుగుప్రజలు కొత్త సంవత్సరాన్ని పరిచయం చేసిన చంద్రబాబు కూడా చిద్విలాసంతో కూర్చున్నారు..

చెప్పండి శర్మగారూ అని చంద్రబాబు ఆదేశించగా... ముందుగా ఆదాయ వ్యయాలు అని మొదలెట్టారు.. ఆ.. గమ్మున చెప్పండి అన్నారు అందరూ కోరస్ గా.. మీ అందరికీ ఆదాయం వెయ్యి.. ఖర్చు పావలా అన్నారు శర్మగారు.. దీంతో వారంతా లోలోన మురిసిపోయారు.. అవును .. అమరావతి కాంట్రాక్టులతో బాగానే వస్తోంది.. ఎక్కడా పైసా ఖర్చు చేయక్కర్లేదు.. శర్మగారు బాగానే చెప్పారు అనుకున్నారు.. లోకేష్ కూడా.. అవును పోస్టింగులు.. బదిలీలు అన్నీ నావే కాబట్టి నా ఆదాయం బాగానే ఉంటుంది.. పైగా జిల్లాలకు వెళ్ళినపుడు ఏమైనా ఖర్చు ఉన్నా అదంతా ప్రభుత్వ ఖాతాలోకి పోతుంది.. కాబట్టి నాకు అంతా ఆదాయమే అనుకున్నారు. 

పవన్ కూడా నేను నియోజ కవర్గానికి వెళ్లడమే తక్కువ.. క్యాడర్ గురించి బాధ లేదు.. అటు సినిమాలు చేస్తూ ఆదాయం బాగానే వస్తోంది.. అంటే పంచాంగం కరెక్ట్ గానే ఉన్నట్లుంది అనుకున్నారు. ఇక రాష్ట్ర ఆదాయం గురించి శర్మ గారు చెబుతూ రాష్ట్రానికి ఆదాయం తగ్గుతుంది.. అప్పులు పెరుగుతాయి అన్నారు.. ఇది విన్నాక బాబుగారు లోలోన రాష్ట్రం ఏమైపోతే నాకేంటి..స్టేట్ మొత్తం అప్పులైతే నాకేంది అనుకున్నారు. ఇహ లోకేష్ గారి సంగతి చూస్తే అంటూ కండువా సవరించుకున్న శర్మగారు..  ఆయనకు సీఎం పదవికి ప్రస్తుతం పవనాలు అనుకూలంగా లేవు.. కొన్నాళ్ళు మంత్రిగిరిలోనే ఉంటారు అన్నారు.. 

దీంతో లోకేష్ పవన్ వైపు గుర్రుగా చూడగా.. నిన్ను సీఎం ను ఎలా చేస్తాను అనుకున్నావు అంటూ పవన్ బదులిచ్చారు.  ఇప్పుడు పవన్ గారి రాశి ప్రకారం చూస్తే ప్రస్తుతానికి ఫర్లేకున్నా మున్ముందు భవిష్యత్ కష్టమే అన్నారు.. దీంతో లోకేష్ చంద్రబాబులు పవన్ను కుమ్మేద్దాం కళ్ళతో అని సిగ్నల్స్ ఇచ్చుకున్నారు. మరి నా సంగతి ఏమిటి అన్నాడు నాగబాబు.. నీకూ పదవీ యోగం ఉంది అన్నాడు శర్మ.. హమ్మయ్య అనుకుంటూ అందరూ వెళ్లిపోయారు..

:::సిమ్మాదిరప్పన్న...

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)