Breaking News

ప్రధాని మోదీ నాపై కుట్ర పన్నారు: కేజ్రీవాల్‌

Published on Sun, 09/22/2024 - 13:02

ఢిల్లీ: తనను అవినీతిపరుడిగా నిరూపించుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుట్ర పన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ చీప్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో జరిగిన ‘జంతాకీ అదాలత్‌’ కార్యక్రమంలో కేజ్రీవాల్‌ పాల్గొని మాట్లాడారు.

‘‘ప్రధాని నరేంద్ర మోదీ మాపై కుట్ర పన్నారు. నన్ను, ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా అవినీతిపరుడని నిరూపించేందుకు కుట్ర పన్నారు. ఆప్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి కుర్చీపై దాహం లేకపోవడం వల్లే రాజీనామా చేశా. డబ్బు సంపాదించడానికి కాదు రాజకీయాల్లో వచ్చింది. దేశ రాజకీయాలను మార్చేందుకు వచ్చాను.

...మేము జాతీయవాదులుము, దేశభక్తులమని ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు అంటున్నారు. మోహన్ భగవత్‌ గారికి నేను గౌరవంగా ఐదు ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మోదీ పార్టీలను విచ్ఛిన్నం చేయడం, నేతలను ప్రలోభపెట్టడం, ఈడీ, సీబీఐలతో బెదిరించడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వాలను పడగొట్టడం సరైనదేనా?. మోదీ బీజేపీలో అత్యంత అవినీతి నాయకులను చేర్చుకున్నారు. వారిని అవినీతిపరులని ఆయనే స్వయంగా పిలిచారు. అలాంటి రాజకీయాలను మీరు అంగీకరిస్తారా?. 

...ఆర్‌ఎస్‌ఎస్ నుంచి బీజేపీ పుట్టింది. బీజేపీ దారితప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్‌ఎస్‌ఎస్‌పై ఉంది. మోదీ తప్పుడు పనులు చేయకుండా మీరు ఎప్పుడైనా ఆపారా?. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు ఆర్‌ఎస్‌ఎస్ అవసరం లేదని అన్నారు. బీజేపీ అంతగా ఎదిగిపోయిందా? మాతృసంస్థపై తన అసహనాన్ని ప్రదర్శించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు మీకు బాధ కలగలేదా?. 75 ఏళ్ల తర్వాత నేతలు రిటైర్ అవుతారని మీరే చట్టం చేశారు. ఈ రూల్ ప్రధాని మోదీకి వర్తించదని కేంద్రమంత్రి అమిత్ షా చెబుతున్నారు. పార్టీ నేత అద్వానీకి వర్తించిన రూల్‌.. మోదీకి ఎందుకు వర్తించదు?’’అని అన్నారు.
 

చదవండి: సీఎం పీఠంపై మహిళా శక్తి

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)