Breaking News

‘సాక్షి’ ఆఫీసు వద్ద పోలీసుల ఓవరాక్షన్‌

Published on Sun, 10/12/2025 - 11:33

సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంలో ‘సాక్షి’పై(Sakshi) కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై రెడ్‌బుక్‌ వికృత చర్యలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం.. సాక్షి ఆఫీసుకు పోలీసులను పంపించింది. ఈ క్రమంలో ఆఫీసుకు వచ్చిన పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు.

వివరాల ప్రకారం.. ఏపీలో నకిలీ(AP Liquor Scam) మద్యం వ్యవహారంపై ఎల్లో మీడియా(Yellow Media) సైతం కథనాలు రాస్తున్నా దాన్ని ఏమీ చేయలేని కూటమి సర్కారు ‘సాక్షి’పై మాత్రం కక్ష సాధిస్తోంది. నకిలీ మద్యం అంశంపై ఎలా వ్యవహరించాలో తెలియక మల్ల­గుల్లాలు పడుతున్న ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ‘సాక్షి’ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సాక్షిని టార్గెట్‌ చేసిన చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను(AP Police) రంగంలోకి దింపింది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాము­లు నెల్లూరు జిల్లాలోనూ ఎక్సైజ్‌ అధికారుల ఫిర్యాదుల మేర­కు ‘సాక్షి’ యాజమాన్యంతోపాటు ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, రిపోర్టర్లపై నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసుస్టేషన్లలో రెండు అక్ర­మ కేసులు నమోదు చేయించింది.

ఇది కూడా చదవండి: నకిలీ మద్యం కేసులో మరో బిగ్‌ ట్విస్ట్‌..

దీంతో, ఆదివారం తెల్లవారుజామునే పోలీసులు.. ఆటోనగర్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఆఫీసు వద్ద పోలీసులు హల్‌చల్‌ చేశారు. కేసుకు సంబంధించి నోటీసులు తీసుకోవాలంటూ సాక్షి సిబ్బందిపై పోలీసులు ఒత్తిడి తెచ్చారు. జర్నలిస్టులను, సాక్షి సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేశారు. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ నిరంకుశ చర్యలకు దిగారు. కాగా, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు సాక్షి కార్యాలయంపైకి పోలీసులను పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడిని జర్నలిస్టులు ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)