Breaking News

ఏపీలో వాళ్లకు కనీసం ఇల్లు కూడా లేదు: మంత్రి రోజా

Published on Sat, 08/12/2023 - 17:31

సాక్షి, తిరుపతి: విశాఖను పాలనారాజధానిగా ప్రకటించినప్పటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌లు విషం చిమ్ముతున్నారని ఏపీ మంత్రి రోజా మండిపడ్డారు. తాజాగా విశాఖలో పవన్‌ పర్యటించడం, రుషికొండలో ఓవరాక్షన్‌ తదితరాలపై శనివారం తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. 

రుషికొండపై నిర్మాణాలు చేపట్టడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు నిబంధనలకు లోబడి నిర్మాణాలు కొనసాగిస్తున్నాం. పైగా నిర్ణీత విస్తీర్ణంలో కంటే తక్కువలోనే కట్టడాలు నిర్మిస్తున్నాం. 69 ఎకరాలు టూరిజం 9 ఎకరాల్లో నిర్మాణాలు, 159 చెట్లు తొలగించాము, 13 వేల చెట్లు నాటాం. అయినా పవన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో అభివృద్ధి కట్టాడాలు కడుతుంటే ఎందుకు అంత బాధ?. కోర్టుల కంటే పవన్‌ గొప్పా?. పైగా  కొండలపై ఏం కట్టొద్దని పవన్‌ అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ ఇళ్లు బంజారాహిల్స్‌లో కొండల మీద ఉన్నాయ్‌ కదా. అసలు రుషికొండలో ఏం అక్రమాలు జరుగుతున్నాయో పవన్‌ చెప్పలేకపోయారు. బోడి వెధవలు.. బోడి ప్రచారం చేయడం ఫ్యాషన్‌గా మారిపోయిందని మంత్రి రోజా అన్నారు.

సీఎం జగన్‌ గురించి ఎందుకు?
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్లపైనా పవన్‌ చేసిన కామెంట్లకు మంత్రి రోజా కౌంటర్‌ ఇచ్చారు. సీఎం జగన్‌కు ఏపీలో ఇల్లు ముందు నుంచే ఉంది. ఆయన తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నారు. పవన్‌ చంద్రబాబుకు బానిస. బాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పని చేస్తుంటాడు. ఈ ఇద్దరికీ ఏపీలో కనీసం ఇల్లు లేనే లేదు అని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌.. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నారు. సీఎం జగన్‌ సంక్షేమాలు దేశంలో కొన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. అసలు జగన్‌ గురించి మాట్లాడే అర్హత ఏం ఉంది? అని పవన్‌ను ప్రశ్నించారామె.

చంద్రబాబుది అవినీతి.. 
నిలదీయాలనుకుంటే చంద్రబాబు అవినీతి గురించి నిలదీయమని పవన్‌ను ఉద్దేశించి మంత్రి రోజా వ్యాఖ్యానించారు. కరకట్ట చంద్ర బాబు అక్రమ నిర్మాణం గురించి ఎందుకు మాట్లాడరు. మొత్తం187.58 కోట్లు మాజీ సీఎం చంద్రబాబు ఖర్చు చేస్తే పవన్ కల్యాణ్ నోరు మెదపలేదు. గీతం కబ్జాలు పవన్‌కు కనబడడం లేదా?. దమ్ము ధైర్యం ఉంటే.. ఈ విషయంలో పశ్నించాలని పవన్‌కు సవాల్‌ విసిరారు మంత్రి రోజా. 

నువ్వొక ప్రతిపక్ష నేతవా?
పవర్‌స్టార్‌ కాదు.. ప్యాకేజీ స్టార్‌. నువ్వు.. చంద్రబాబు పనికిమాలిన పార్టీలకు అధ్యక్షులు. ఒక్క ఎమ్మెల్యే లేడు నువ్వేం ప్రతిపక్ష నేతవి. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేదు. పక్క పార్టీ జెండాలు మోసే సంస్కృతి మీది. నిన్ను పవన్ కల్యాణ్‌ అనాలా.. పనికిమాలిన కళ్యాణ్ అనాలా అర్థం కావడం లేదు. ఆటలో అరటి పండు లాంటి వాడివి.. నువ్వు ప్యాకేజీ పడినప్పుడు ఒక వింత జీవిలా ప్రవర్తిస్తున్నావు. వాలంటీర్‌లపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.  తొలగించిన వాలంటీర్ హత్య చేస్తే.. బోడి గుండుకు మోకాలికి లింకు వేయడమేనా? అని పవన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

వైజాగ్‌ అభివృద్ధి ఓర్వలేకే.. 
చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు విశాఖను క్రైమ్‌ సిటీగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ పరిపాలన రాజధాని రాకూడదనే కుట్రతో ముందుకెళ్తున్నారు. టీడీపీ విశాఖలో కబ్జా చేసిన 450 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సీఎం జగనన్న విశాఖకు అదానీ డేటా సెంటర్ తెచ్చారు. ఆరు వేల కోట్లతో బీచ్ కారిడార్ నిర్మాణం చేపట్టారు. వెనుక బడిన ఉత్తరాంద్ర అంతర్జాతీయ స్థాయిలో అభివృధ్ధి చేస్తుంటే ఒర్వ లేక కుట్ర చేస్తున్నారు అని మంత్రి రోజా ప్రతిపక్షాల కుట్రకు ఏకేశారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)