Breaking News

‘చంద్రబాబు ఎప్పుడు నిజం చెప్పారు?’

Published on Thu, 10/26/2023 - 16:31

సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ అని యాత్ర మొదలుపెట్టారని.. అయితే నిజం గెలవాలని ఉద్యమం చేస్తే చంద్రబాబు మరింత ఇరుక్కుంటారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు ఇవాళ జైల్లో ఉన్నారని స్పష్టం చేశారాయన. 

గురువారం రాజమహేంద్రవరంలో అంబటి మీడియాతో మాట్లాడారు. ‘‘భువనేశ్వరి నిజం గెలవాలి అని యాత్ర చేపట్టారు. అలా కాకుండా.. అవినీతి గెలవాలి, అబద్ధం గెలవాలి, అన్యాయం గెలవాలి అని ఉద్యమం చేయండి. అప్పుడు మీకు ఉపయోగం ఉండొచ్చు’’ అని ఎద్దేవా చేశారాయన. 

‘‘సింపతీ కోసమే మీరు(భువనేశ్వరిని ఉద్దేశిస్తూ..) యాత్ర చేస్తున్నారు. మీ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు మీరు సిద్ధమా?. మీరు విచారణకు ఆహ్వానిండి.. అప్పుడు నిజం గెలుస్తుంది’’ అని అంబటి అన్నారు. 

చంద్రబాబు కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయి. అందుకే బాబును అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు ఇవాళ జైల్లో ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్‌ చేశారని, ఇది అక్రమ అరెస్ట్‌ ఎలా అవుతుంది? అని అంబటి,  టీడీపీ శ్రేణుల్ని ఉద్దేశించి ప్రశ్నించారు. సీఎం జగన్‌పై బురద జల్లేందుకు పథకం ప్రకారమే ప్రచారం చేస్తున్నారని అన్నారాయన. 

స్కామ్‌లన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయి. చంద్రబాబు ఎప్పుడు నిజం చెప్పారు? కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చెప్పారా? ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు నిజం చెప్పారా? తెలంగాణలో ఓటుకు నోటు కేసులో నిజం చెప్పారా? రాజధాని భూముల కేసులో నిజం చెప్పారా? అధికార ధనబలంతో నిజాన్ని ఇంతకాలం తొక్కిపెట్టారు అని అని భువనేశ్వరికి చురకలంటించారాయన.

పురందేశ్వరికి కౌంటర్‌
బీజేపీ ఏపీ చీఫ్‌ దగ్గుబాటి పురందేశ్వరి చేసిన మద్యం ఆరోపణలపై అంబటి రాంబాబు కౌంటర్‌ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలు దగ్గాయి. కొత్త డిస్టరీస్‌లకు అనుమతి ఇవ్వలేదు. కొత్త బ్రాండ్‌లకు అనుమతి ఇవ్వలేదు. బూమ్‌ బూమ్‌ బీర్లకు, ప్రెసిడెంట్‌మెడల్‌కు సైతం చంద్రబాబే అనుమతి ఇచ్చారు అని అంబటి గుర్తు చేశారు. 

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)