Breaking News

Shameless TDP: దమ్ముంటే సమాధానాలు చెప్పాలి

Published on Wed, 01/17/2024 - 08:00

ఆంధ్రప్రదేశ్‌లో విద్వేషపూరిత రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ప్రతిపక్షాలు ఏకమై..  సంక్షేమ ప్రభుత్వంగా ప్రజల మన్ననలు అందుకుంటున్న వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. టీడీపీ, జనసేనకు బాకా ఊదే యెల్లో మీడియా పత్రికలు, పేపర్లు ఈ విషప్రచారానికి తమవంతు కృషి చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో పచ్చ మంద చేస్తున్న హడావిడికి హద్దు లేకుండా పోతోంది. మరోవైపు మౌత్‌ టాక్‌ పేరిట నడుస్తున్న యవ్వారం.. టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనంగా కనిపిస్తోంది.

క్షేత్రస్థాయిలో CM జగన్‌ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు జరిగే కుట్ర.. నీచ రాజకీయాలకు పరాకాష్టగా నిలుస్తోంది. బస్సులు, రైళ్లు, ఆటోలు.. ఆఖరికి జనం గుమిగూడే టీ స్టాల్ లాంటి చోట్లా మౌత్ టాక్ పేరిట హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలో.. వైఎస్సార్‌సీపీ మీద లేని ప్రజా వ్యతిరేకత చూపించేందుకు నానా తంటాలు పడుతోంది పచ్చ బ్యాచ్‌. అయితే ప్రశ్నించే ముందు.. తమ దగ్గరా వాటికి సమాధానాలు లేవనే విషయాన్ని మాత్రం గ్రహించలేకపోతోంది.

స్టేట్‌మెంట్‌ 1 : రాష్ట్రం నాశనం అయ్యిందట!
సుభిక్షంగా ఉన్న రాష్ట్రాన్ని.. అప్పుల ఊబిలో ఉందని..  శ్రీలంక అయ్యిందని.. ఏవేమో ప్రచారాలు చేస్తారు. మరి రాష్ట్రం ఎలా నాశనం అయ్యింది? అది ఎలాగో చెప్పమని అడిగితే మాత్రం మౌనంగా ఉండిపోతారు

స్టేట్‌మెంట్‌ 2 : ప్రజల్ని సోమరిపోతుల్ని చేశారంట!
సంక్షేమ విషయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలానికి.. సీఎంగా జగన్‌ అందించిన సంక్షేమానికి అసలు పోల్చడానికి కూడా వీలు లేదు. అన్ని వర్గాలకు ఆసరాగా నిలిస్తే.. ఇదిగో ప్రజల్ని సోమరిపోతుల్ని చేశారనే మాట అంటారు. సంవత్సరానికి నీకు ఒక 15 వేలు ఇస్తా నువ్వు ఏమి పని చెయ్య కుండా ఉంటావా అంటే ఏమి పలకరు. 

స్టేట్‌మెంట్‌ 3 : ఎన్నికల్లో 160 సీట్లు టీడీపీవేనట!
ఏపీలో పొత్తు రాజకీయాలకు ఓ నీతి అంటూ లేకుండా పోయింది. జనసేన టీడీపీ పోటీ స్థానాల కోసం కొట్లాడుకునే స్టేజ్‌కి వచ్చేశాయి. కుదరితే ఒకపార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్‌ చేసైనా పోటీ చేయాలని ఆ రెండు పార్టీల వాళ్లు ప్రయత్నాలు చేయడం కొసమెరుపు. అసలు సైకిల్‌ సింబల్ మీద ఎన్ని పోటీ చేస్తారు అంటే చెప్పరు, పందెం ఉంటే పెట్టు అంటే పారిపోతారు.

స్టేట్‌మెంట్‌ 4 : స్కూల్స్‌కి జగన్‌ రంగులు మాత్రమే వేశాడట! 
నాడు-నేడు ఆ కళ్లకు కనిపించడం లేదేమో. ఏపీలో స్కూల్‌ డ్రాపింగ్‌ సంఖ్య తగ్గి.. కేరళతో పోటీ పడే స్థాయికి చేరిందని గుర్తిండం లేదేమో. ప్రభుత్వ స్కూల్స్ కి వెళ్లి విజిట్ చేద్దాము అంటే రాడు

స్టేట్‌మెంట్‌ 5 : రోడ్లు నాశనం అయ్యాయట!
గతంలో సంగతి ఏంటి? మరి 2014 - 2019 అంత బాగా రోడ్స్ వేస్తే ఎందుకు నాశనం అయ్యాయి? అసలు ఎవరి హయాంలో రోడ్స్ కోసం ఎక్కువ ఫండ్స్ ఇచ్చారు? అంటే మాత్రం మాట్లాడరు. 

స్టేట్‌మెంట్‌ 6 : ఉద్యోగాల్లేవ్‌..
వలంటీర్‌ వ్యవస్థ దగ్గరి నుంచి పరిశ్రమల స్థాపన దాకా.. ఉద్యోగాల రూపకల్పనలో సీఎం జగన్‌ చొరవకు దేశమే హ్యాట్సాఫ్‌ చెప్పింది. అయినా కూడా జాబ్‌ క్యాలెండర్‌ పేరిట బాబు అనుచరులు చేసే విమర్శలకు అంతే లేకుండా పోతోంది. వచ్చిన ఉద్యోగాల గురించి మాట్లాడితే.. అక్కడి నుంచి జంప్‌ అవుతారు

స్టేట్‌మెంట్‌ 7 : పరిశ్రమలు పారిపోతున్నాయట!
ఏ పరిశ్రమలు..  ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోయాయి? ఎందుకు పారిపోయాయి? అంటే సమాధానం ఉండదు. ఆ సమాచారం ఇవ్వమన్నా.. ఇవ్వరు. తన హెరిటేజ్ మాత్రం పారిపోకుండా అలాగే ఉండిపోతుందా? మరి.

స్టేట్‌మెంట్‌ 8 : ఐటీ కంపెనీలు రావట!
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ కంపెనీలు 2014-2019  ఎక్కువ వచ్చాయా ? 2019 - 2024 లో ఎక్కువ వచ్చాయా  అంటే పలకడు, ఉలకడు, జారుకుంటారు

స్టేట్‌మెంట్‌ 9 : రాజధాని ఏది?
రాజధాని కోర్టులో ఉంది అంటే ఏమి పలకడు, సుప్రీం కోర్టుకి వెళ్లారు వాళ్ళు డిసైడ్‌ చేస్తారు.. కానీ, మాకు రియల్ ఎస్టేట్ అమరావతి కావాలి అంటారు. 

స్టేట్‌మెంట్‌ 10 : ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందట!
2014-2019లో రాష్ట్రానికి ఏమి చేశారు అంటే మాత్రం పలకరు. ఎందుకంటే.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయలేనిది,  ఈ ఐదేళ్లలోనే సీఎం జగన్‌ ఎన్నో రెట్లు ఎక్కువ చేసి చూపించారు కాబట్టి.

ఇదీ చదవండి: కుట్రదారు.. లబ్ధిదారు అంతా చంద్రబాబే!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)