Breaking News

వైఎస్సార్‌సీపీ ఆరో జాబితా విడుదల

Published on Fri, 02/02/2024 - 18:57

గుంటూరు, సాక్షి: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిస్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్‌సీపీ ప్రణాళిక సిద్దం చేసింది. ఈ క్రమంలో.. పలు అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్‌ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మారుస్తోంది. తాజాగా పార్టీ అధిష్టానం శుక్రవారం సాయంత్రం ఆరో జాబితాను విడుదల చేసింది. మంత్రి మేరుగ నాగార్జున, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ జాబితాను ప్రకటించారు. ఆరో జాబితాలో నాలుగు పార్లమెంట్‌, ఆరు అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలను మార్చింది వైఎస్సార్‌సీపీ అధిష్టానం. 

ఇప్పటివరకు ఐదు జాబితాల వారీగా..   61 మంది ఎమ్మెల్యే నియోజకవర్గాలకు, 14 పార్లమెంట్‌ స్థానాలకు ఇన్‌ఛార్జిలను మార్పులు జరిగాయి. తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు(3 ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు(6 ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో జాబితాలో 8 స్థానాలకు(1 ఎంపీ, 8 అసెంబ్లీ), ఐదో జాబితాలో 10 స్థానాలకు(4 ఎంపీ, 6  అసెంబ్లీ స్థానాలకు) సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలు విడుదల చేసింది వైఎస్సార్‌సీపీ.

వై నాట్‌ 175 నినాదంతో.. ప్రజలకు జరిగిన మంచిని, అందిన సంక్షేమాన్ని.. రాష్ట్రానికి జరిగిన అభివృద్ధిని చూపిస్తూ ఎన్నికలకు సిద్ధం అవుతోంది వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.

వైఎస్సార్‌సీపీ తొలి జాబితా ఇదే

వైఎస్సార్‌సీపీ రెండో జాబితా ఇదే!

ఉత్తరాంధ్రలో ఆ ఇద్దరికీ.. 
అనకాపల్లి, అరకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్‌గా వైవీ సుబ్బారెడ్డిని, అలాగే.. అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ, అసెంబ్లీ నియోజకవర్గాలకు.. విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గాలకు మజ్జి శ్రీనివాసరావును డిప్యూటీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా నియమించింది వైఎస్సార్‌సీపీ.

‘‘మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.

వైఎస్సార్‌సీపీ మూడో జాబితా ఇదే!

వైఎస్సార్‌సీపీ నాలుగో జాబితా ఇదే!

వైఎస్సార్‌సీపీ ఐదో జాబితా ఇదే!

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)