Breaking News

ఏపీలో టీడీపీకి కాంగ్రెస్‌ తోకపార్టీ.. షర్మిలను రేవంత్ గెలిపిస్తాడంట!

Published on Tue, 07/09/2024 - 16:09

గుంటూరు, సాక్షి: ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ ఏనాడో భూస్థాపితం అయ్యిందని.. అలాంటి పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో పని చేస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి. వైఎస్సార్‌ జయంతి వేడుకల పేరిట కాంగ్రెస్‌ పార్టీ చేసిన హడావిడిని రవిచంద్రారెడ్డి ఎండగట్టారు.

మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో భూస్థాపితం అయింది. ప్రస్తుతం టీడీపీకి కాంగ్రెస్ తోకపార్టీ. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది. కేవలం తన అన్న జగన్ మీద కోపంతోనే షర్మిల పార్టీ నడుపుతోంది. వైఎస్సార్ మీద అంత మమకారం ఉంటే.. ఆయన పేరును చంద్రబాబు తొలగిస్తుంటే షర్మిల ఎందుకు మాట్లాడడం లేదు?. 

.. కడపలో బై ఎలక్షన్ వస్తుందని ఎల్లోమీడియాలో వార్తలు వచ్చాయి. దాన్ని పట్టుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడే కూర్చుని ఉంటారని అనడం విడ్డూరం. మహబూబ్ నగర్ గెలిపించుకోలేని రేవంత్.. కడపలో షర్మిలను గెలిపిస్తాడంట. చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారి ఒప్పందాలు అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ చేసిన‌ పాపమే విభజననష్టం. ప్రత్యేక హోదా, పెండింగ్‌ ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదు?.. 

.. వైఎస్సార్ కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తే.. జగన్ అంతకుమించి చేశారు. ప్రజల గుండెల్లో జగన్ గొప్పగా ఉన్నారు. ఎన్నికల్లో జరిగిన మాయాజాలం గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అయినా దాని గురించి ప్రస్తుతం మేము మాట్లాడదల్చుచుకోలేదు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుండి పొత్తుల కోసం వెంపర్లాడలేదు. మేము పొత్తు లు పెట్టుకుంటే చంద్రబాబు గెలిచేవాడే కాదు. చంద్రబాబు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనుకున్నాం. ఆ తర్వాత ప్రజాపోరాటాలు చేస్తాం అని రవిచంద్రారెడ్డి అన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)