Breaking News

ఖాళీ కుర్చీలతో చంద్రబాబు కేబినెట్‌ సమావేశం!

Published on Fri, 07/10/2026 - 12:17

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్‌ భేటీకి కొందరు మంత్రులు గైర్హాజరయ్యారు. దీంతో కీలక సమావేశంలో పలువురు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో కొన్ని కుర్చీలు ఖాళీగా కనిపించాయి.

ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ సమావేశానికి మరోసారి హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో ఆయన ముంబై వెళ్లనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. గత రెండు కేబినెట్‌ సమావేశాల్లోనూ నడుం నొప్పి, ఇతరత్ర కారణాలతో పవన్‌ కళ్యాణ్‌ మధ్యలోనే వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ఆ కారణంతోనే ఆయన సమావేశానికి రాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇక మంత్రి నారా లోకేశ్‌ ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నారు. మంత్రి టీజీ భరత్‌ ఏమో అమెరికా పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు మంత్రులంతా విదేశీ పర్యటనలు చేయొద్దని చంద్రబాబు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక మరో మంత్రి నిమ్మల రామానాయుడు వ్యక్తిగత కారణాలతో(బెంగళూరు పర్యటనలో ఉన్నట్లు సమాచారం) హాజరు కాలేదు. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తిరుపతికి కేంద్రమంత్రి రాక సందర్భంగా ప్రొటోకాల్‌ విధుల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. మరో ఇద్దరు కూడా హాజరు కాలేదని తెలుస్తున్నా.. ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. 

ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలువురు మంత్రులు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయా కారణాలతోనే మంత్రులు గైర్హాజరయ్యారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు దాదాపుగా లేకున్నా.. మీటింగ్‌ను పోస్ట్‌ పోన్‌ చేసే అవకాశం ఉన్నా.. చంద్రబాబు పంక్చువాలిటీ పేరిట మంత్రివర్గ భేటీ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)