Breaking News

నందిగామలో ఉద్రిక్తత.. ‘అన్నదాత పోరు’ను అడ్డుకున్న పోలీసులు

Published on Tue, 09/09/2025 - 10:36

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. నందిగామలో ‘అన్నదాత పోరు’ను పోలీసులు అడ్డుకున్నారు. రైతులతో కలిసి ఆర్డీవో కార్యాలయానికి బయల్దేరిన వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రైతులు, వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసుల దౌర్జన్యానికి దిగారు. గంపలగూడెం మండలం రాజవరం గ్రామ శివారులో వైఎస్సార్‌సీపీ శ్రేణుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నాఉ. నందిగామలో జరిగే అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు.  పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు.

వైఎస్సార్‌సీపీ 'అన్నదాత పోరు'పై చంద్రబాబు సర్కార్ కుట్రలకు తెరలేపింది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా నిరసనలు ఆపేది లేదని రైతులు తేల్చి చెప్పారు. రైతులు, పార్టీ నేతలను కట్టడి చేసేందుకు పోలీసులతో బెదిరింపుకు దిగుతూ.. నోటీసులు ఇస్తూ అరెస్టు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల పదిమంది, 15 మందితోనే నిరసనలు చేయాలని ఆంక్షలు విధించింది.

ఆంక్షలతో ఉద్యమాలను కట్టడి చేయలేరని.. రైతులు, రైతు నేతలు స్పష్టం చేశారు. యూరియా కొరత, ఇతర సమస్యలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్డీవో కార్యాలయాల సమీప ప్రాంతాలకు చేరుకున్న రైతులు.. పోలీసులు, కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.

వైఎస్సార్‌సీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు తరలివస్తున్నారు. చంద్రబాబు సర్కార్ విధించిన ఆంక్షలను చేధించుకుని రైతులు ఉద్యమిస్తున్నారు. యూరియా సరఫరాలో సీఎం చంద్రబాబు ఘెరంగా విఫలమయ్యారని... పోలీసుల ద్వారా ఎన్ని ఆంక్షలు విధించినా ఆందోళన ఆపేది లేదని రైతులు అంటున్నారు.

ఎరువుల బ్లాక్‌ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో కూటమి సర్కారుపై వైఎస్సార్‌ సీపీ రణభేరి మోగిస్తోంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు.. శాంతియుత ఆందోళనలకు తరలివస్తున్నాయి.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు