Breaking News

జగన్‌ పాలనలో వర్షాలు.. బాబు పాలనలో కరువుకాటకాలు 

Published on Tue, 05/16/2023 - 04:03

చిత్తూరు కార్పొరేషన్‌(చిత్తూరు జిల్లా)/తిరుపతి కల్చరల్‌ : వైఎస్సార్‌తో పాటు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కరువు ఉండదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. జగన్‌ పాలనలో గత నాలుగేళ్లుగా ఏ ఒక్క మండలాన్నీ కరువు ప్రాంతంగా ప్రకటించలేదని ఆనందం వ్యక్తం చేశారు. వర్షాలు సుభిక్షంగా పడుతున్నాయన్నారు. వైఎస్సార్‌ పాలనలోనూ సమృద్ధిగా వర్షాలు పడ్డాయని, కానీ చంద్రబాబు పాలనలో మాత్రం కరువు తాండవిస్తుందని చెప్పారు.

ప్రపంచ బ్యాంకు నిధులు రూ.1.9 కోట్లతో చిత్తూరులో జిల్లా డేటా సెంటర్‌ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలిసి అంబటి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.16 కోట్లతో డేటా సెంటర్లను ఏలూరు, విజయనగరం, చిత్తూరు, విశాఖ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కలెక్టర్‌ షన్మోహన్, ఇరిగేషన్‌ అధికారులు పాల్గొన్నారు. 

శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో గంగమ్మ జాతర  
ఈ ఏడాది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో వెంకన్న చెల్లి గంగమ్మతల్లి జాతర ఉత్సవాలు జరుగుతుండటం సంతోషకరమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తిరుపతి గంగజాతరలో భాగంగా సోమవారం మంత్రి అంబటి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీతాతయ్యగుంట గంగమ్మకు సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మంత్రికి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేయర్‌ డాక్టర్‌ శిరీష, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)