Breaking News

పవన్‌, చంద్రబాబు పొలిటికల్‌ డాన్సర్లే: మంత్రి అంబటి

Published on Sun, 04/07/2024 - 12:32

సాక్షి, సత్తెనపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు. అసలు చంద్రబాబు పార్టీలో పోటీ చేసేందుకు నేతలే లేరని ఎద్దేవా చేశారు. మేము వదిలేసిన వ్యక్తులకు టీడీపీలో టికెట్‌ ఇచ్చి పోటీ చేయిస్తున్నారని సెటైర్లు వేశారు. 

కాగా, మంత్రి అంబటి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సభలన్నీ అట్టర్‌ ఫ్లాప్‌. సందుల్లో మీటింగ్‌లు పెట్టి జనం రాలేందంటే మీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదు. ఎక్కడ పదువులు అనుభవించి ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు సిగ్గు, శరం లేదు. లావు కృష్ణదేవరాయులు మా పార్టీ నుంచి వెళ్లి సైకిల్‌ ఎక్కాడు. వైఎస్సార్‌ టికెట్‌ ఇస్తే గెలిచిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి. 

బాబుతో పొత్తు అంటే సమాధి కట్టడమే..
చంద్రబాబు ఇష్టం వచ్చిన మాట్లాడారు. చంద్రబాబు పక్కన ఉన్న ముగ్గురు ఎవరు?. తన పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తు లేవు. చంద్రబాబు, పవన్‌లను నేను విమర్శించానే తప్ప తిట్టలేదు. సొంత పార్టీ నేతలే చంద్రబాబును తిడుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ తిట్టిన తిట్లు చంద్రబాబుకు గుర్తు లేదు. పొత్తు పెట్టుకోవడం సమాధి కట్టేయడమే చంద్రబాబు పని. ఇది గతంలోనే కన్నా చెప్పారు. 

విమర్శలు మరింత ఘాటుగా చేస్తాను. కానీ, దిగజారి మాట్లాడను. సీఎం వైఎస్‌ జగన్‌ దెబ్బకు టీడీపీ తట్టుకునే పరిస్థితి లేదు. 175 స్థానాల్లో గెలిచి మళ్లీ వైఎస్‌ జగనే ముఖ్యమంత్రి అవుతారు. సర్వేలన్నీ ఇప్పటికే వైఎ‍స్సార్‌సీపీ విజయాన్ని తేల్చేశాయి. ఎన్నికల్లో ఓటమి ఖాయం కావడంతో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు గెలవడం కష్టమే. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ కూడా ఓడిపోతాడు. 

పవన్‌కు రాజకీయాలెందుకు?
అసలు పవన్‌కు రాజకీయాలు ఎందుకు?. రెండు రోజలు ప్రచారం చేసి ఐదు రోజలు పడుకుంటాడు. రాష్ట్రమంతటా పవన్‌ తిరిగే పరిస్థితి లేదు. డబ్బుల కోసం కక్కుర్తిపడే అవసరం నాకు లేదు. చంద్రబాబు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నది ఎవరు?. చంద్రబాబు చేసిన తప్పిదంతోనే పోలవరం ఆలస్యమవుతోంది. సంక్రాంతికి డాన్స్‌లు చేస్తే తప్పేంటి?. పండుగకు కుటుంబ సభ్యులతో డాన్స్‌ చేస్తే తప్పా?. చంద్రబాబులా నేను పొలిటికల్‌ డాన్సర్‌ను కాదు. రోజుకో పార్టీతో డాన్స్‌ చేస్తే వ్యక్తి చంద్రబాబు. పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు ఇద్దరూ పొలిటికల్‌ డాన్సర్లే’ అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)