Breaking News

చంద్రబాబుపై ఆలపాటి తిరుగుబాటు

Published on Wed, 01/17/2024 - 04:12

సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెనాలి సీటు విషయంలో జన­సేన, తెలుగుదేశం మధ్య చిచ్చు రాజుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ (రాజా) తిరుగుబాటు బావుటా ఎ­గురవేశారు. బుధవారం గుంటూరులో నియోజకవర్గంలో­ని రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, మండల, పట్టణ పార్టీ, అన్ని అ­ను­బంధ విభాగాల నేతల నేతలతో రాజా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తెనాలి సీటు తెలుగుదేశం పార్టీకి కేటాయించకపోతే ఈ నేతలంతా మూకుమ్మడి రాజీనామాలు చేయనున్నట్లు తెలిసింది. 

తెనాలి సీటును జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు ఇస్తున్నట్లు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చాలా కాలం క్రితమే ప్రకటించారు. దీంతో కొద్దికాలం రాజకీయాలకు దూ­రంగా ఉన్న రాజా తర్వాత మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నాదెండ్ల మనోహర్‌తో  కలిసి చర్చలు జరపడం, కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం చేశారు. నాదెండ్ల మనోహర్‌ను రాజ్యసభకు పంపించి ఈ సీటు రాజాకు ఇస్తున్నట్లు చంద్రబాబు ఇటీవల చెప్పారు. దీంతో రాజా ప్రజా పాదయాత్ర పేరుతో తెనాలి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించారు. రాజ్యసభకు వెళ్లడానికి మనోహర్‌ ఇష్టపడలేదు. తె­నా­లిలోనే ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు.

తెనాలిలోనే ఉంటూ టీడీపీ, జనసేన ముఖ్య నేతలను కలుస్తూ సీటు తనదేనని చెబుతున్నారు. తనకు సహకరించాలని కోరుతున్నా­రు. దీంతో తెనాలి సీటు దక్కదన్న అభిప్రాయానికి వచి్చన ఆలపాటి రాజా గుంటూరు వెస్ట్‌ లేదా పెదకూరపాడు కేటాయించాలని కోరుతున్నట్లు తెలిసింది. ఈ సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం ఇష్టపడటంలేదు. దీంతో రాజా పార్టీ అధిష్టానంపై తిరుగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆయన పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ మంగళవారం తన ఇంటికి పిలిపించుకుని, వారితో చర్చలు జరిపారు.

పొత్తులో భాగంగా సీటును జనసేన పార్టీకి ఇస్తే సహించబోమని ఈ సమావేశం అనంతరం నేతలు మీడియాకు తెలిపారు. పార్టీ తెనాలి పట్టణ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, మాజీ అధ్యక్షుడు ఖుద్దూస్, మాజీ ఎంపీపీలు కేశన కోటేశ్వరరావు, సూర్యదేవర వెంకటరావు, మాజీ జెడ్పీటీసీ శాఖమూరి చిన్నా, వైకుంఠపురం మాజీ చైర్మన్‌ జొన్నాదుల మహేష్, అర్బన్‌ బ్యాంకు మాజీ చైర్మన్‌ సోమవరపు నాగేశ్వరరావు, కౌన్సిలర్లు ఆడుసుమిల్లి వెంకటేశ్వరరావు, దేసు యుగంధర్, తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు, ఇతర టీడీపీ నాయకులు వీరమాచినేని వెంకటేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్‌ వేమూరి శేషగిరిరావు, రావి చిన్ని, రావి సూర్యకిరణ్‌ తేజ, లాయర్‌ మద్ది మల్లికార్జునరావు తదితరులతో రాజా ఈ సమావేశం నిర్వహించారు. బుధవారం గుంటూరులో జరిగే సమావేశంలో రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని వారు నిర్ణయించినట్లు తెలిసింది.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు