Breaking News

ఆ విషయంలో మోదీ దిట్ట.. ప్రధానిపై ఖర్గే నిప్పులు

Published on Thu, 01/25/2024 - 17:06

సాక్షి, హైదరాబాద్‌: హామీలు ఇచ్చి తప్పించుకునే రోజులు పోయాయని.. ప్రధాని మోదీ ఎన్నో హామీలు ఇచ్చారు.. కానీ అమలు చేయలేదంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. మోదీ హమీలపై వచ్చే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ప్రశ్నిస్తానన్నారు. ఎల్‌బీ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్‌ బూత్‌ కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల్లో రెండు హమీలు అమల్లోకి తెచ్చామని, మిగిలిన హామీలు కూడా త్వరలోనే అమల్లోకి తెస్తామని పేర్కొన్నారు. సమరోత్సహంతో కార్యకర్తలు వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం పనిచేయాలంటూ ఖర్గే పిలుపునిచ్చారు.

సమస్యలు ఎదురైనప్పుడు మోదీ ఏదో ఒక ఇష్యూతో డైవర్ట్‌ చేస్తుంటారని.. సమస్యల నుంచి దృష్టి మళ్లించడంలో మోదీ దిట్ట అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. మోదీ, షా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి వేసే కుటిల రాజకీయం చేస్తుంటారు. ఈడీ,ఐటీ, సీబీఐలను ఉసిగొలిపి.. ప్రతిపక్ష నేతలను బెదిరిస్తున్నారు. బీజేపీ బెదిరింపులకు కాంగ్రెస్‌ నేతలు ఎవరూ భయపడరు. కేసీఆర్‌ ఎప్పుడూ బీజేపీని నిలదీయలేదు.. కాంగ్రెస్‌పైనే ఎప్పుడూ విమర్శలు చేసేవారు’’ అంటూ ఖర్గే దుయ్యబట్టారు.

‘‘ఒకసారి పాకిస్తాన్‌ బూచీ చూపిస్తారు.. మరోసారి దేవుడ్ని వాడుకుంటారు. మోదీ నేతృత్వంలో ధరలు పెరిగిపోయాయి. సామాన్యుల ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు రాహుల్‌ న్యాయ యాత్ర చేస్తున్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కార్యకర్తలు అదే జోష్‌తో పనిచేసి పార్టీని గెలిపించాలి’’ అని ఖర్గే పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అలా మాట్లాడే వాళ్లను చెప్పుతో కొట్టే రోజులొస్తాయ్‌: కిషన్‌రెడ్డి



 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)