Breaking News

రేపు హైదరాబాద్‌కు ఖర్గే

Published on Wed, 01/24/2024 - 04:21

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. పార్టీకి చెందిన పోలింగ్‌ బూత్‌ స్థాయి ఏజెంట్లతో ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే సమావేశంలో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లకు దిశానిర్దేశం చేయనున్నారు.

కాగా, ఈ సమావేశం ఏర్పాట్లపై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సమీక్షించారు. తన నివాసంలో మహేశ్‌తో సమావేశమైన రేవంత్‌ కార్యక్రమ ఏర్పాట్లు జరుగుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన పోలింగ్‌ బూత్‌ స్థాయి ఏజెంట్స్‌ అందరూ సమావేశానికి హాజరు కావాలని ఈ సందర్భంగా రేవంత్‌ పిలుపునిచ్చారు. 

సీఎంను కలిసిన సలహాదారులు, ఎమ్మెల్సీలు
కాగా, కొత్తగా నియమితులైన సలహాదారులు, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి, ఇద్దరు ఎమ్మెల్సీలు మంగళవారం సీఎం రేవంత్‌ను కలిశారు. సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ, హర్కర వేణుగోపాల్‌రావు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవితో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్‌లు జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వారిని సీఎం రేవంత్‌ అభినందించారు. అదే విధంగా దావోస్‌ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం పట్ల సలహాదారులు, ఎమ్మెల్సీలు సీఎం రేవంత్‌కు అభినందనలు తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)