Breaking News

వామ్మో.. మామూలు ఖ‌ర్చు కాదు!

Published on Sat, 08/09/2025 - 16:28

తిరిగే కాలు, తిట్టే నోరు ఉరికే ఉండ‌వ‌ని సామెత‌. కొంత‌మంది తెగ తిరుగుతుంటారు. నిరంత‌రం ప్ర‌యాణిస్తుంటారు. కొత్త ప్ర‌దేశాలు, ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను చుట్టి వ‌స్తుంటారు. ఈ మ‌ధ్య కాలంలో విదేశాల‌కు వెళ్లే భార‌తీయుల సంఖ్య బాగా పెరిగింది. ఉన్న‌త చ‌దువులు, ఉద్యోగాలతో పాటు ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను సంద‌ర్శించేందుకు ప్ర‌పంచ యాత్రలు చేస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖ‌ర్చు పెట్టేందుకైనా వెనుకాడ‌డం లేదు.

15 ల‌క్ష‌ల కోట్లు!
ప్ర‌పంచ యాత్ర‌లు చేసేవాడు ప్రజ్ఞావంతుడౌతాడని పెద్ద‌లు చెబుతుంటారు. దీన్నే ఫాలో అవుతున్నారు మ‌న‌వాళ్లు. విదేశీ ప్ర‌యాణాల కోసం భారతీయులు భారీగానే ఖర్చుపెడుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. 2009-10లో విదేశీ ప్రయాణాలకు 17 మిలియన్ డాల‌ర్లు (సుమారు రూ. 1.50 లక్షల కోట్లు) వెచ్చించారు. ఈ వ్యయం 2024-25 నాటికి దాదాపు వెయ్యి రెట్లు (975%) శాతం పెరిగి 17 బిలియ‌న్ డాల‌ర్ల‌కు (దాదాపు రూ. 15 ల‌క్ష‌ల కోట్లు) చేరుకుంది. ఈ లెక్క‌న చూసుకుంటే సగటు వార్షిక వృద్ధి రేటు 58.2 శాతంగా ఉంది.

జ‌ర్నీలకే ఎక్కువ‌!
గ‌తంలో విదేశాల్లో ఉన్న‌త విద్య అభ్య‌సించేందుకు ఇండియ‌న్స్ ఎక్కువ‌గా ఖ‌ర్చు చేసేవారు. కానీ ఇప్పుడు ప్ర‌యాణాల కోసం కూడా అధికంగా వెచ్చిస్తున్నారు. ఈక్విటీ నుంచి రియల్ ఎస్టేట్ (Real Estate) వరకు ప్రతిదానికీ డబ్బు ఖర్చు పెడుతున్నారు. అయితే విదేశీ ప్ర‌యాణాల‌కు కూడా ఎక్కువ‌ మొత్తంలో వ్య‌యం చేయ‌డానికి ఏమాత్రం వెనుకాడ‌డం లేదు. ఇంకా వివ‌రంగా చెప్పాలంటే విదేశాల్లో చ‌దువు కంటే కూడా జ‌ర్నీలు చేయ‌డానికే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఈ వ్య‌యం గ‌త 15 ఏళ్ల‌లో 1000 రెట్లు పెరగడ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం.

ఎక్కడికి వెళ్తున్నారు?
తుర్కియే, ఫ్రాన్స్, మారిషస్, అమెరికా, బ్రెజిల్, చైనాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలను భారతీయులు చుట్టి వ‌స్తున్నారు. 2009 సంవ‌త్స‌రంలో 1.1 కోట్ల మంది ఇండియ‌న్స్ విదేశాలు వెళ్లారు. కోవిడ్-19 (Covid-19) మహమ్మారికి ముందు ఈ సంఖ్య 2.6 కోట్లకు పెరిగింది. కరోనా స‌మ‌యంలో ఈ సంఖ్య బాగా తగ్గింది. కానీ, కరోనా  ముగిసిన‌ తర్వాత పరిస్థితి మెరుగుపడటంతో, 2022లో విదేశాలకు ప్ర‌యాణించిన‌ (travel abroad) భారతీయుల సంఖ్య మ‌ళ్లీ 2 కోట్లు దాటింది.

చ‌దువుకెంత ఖ‌ర్చు?
భారతీయులు మెరుగైన జీవితాన్ని గడపడానికి విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారని టీఓఐ నివేదిక వెల్ల‌డించింది. ఉన్నత విద్య, మెరుగైన ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్నారు. ఉపాధికి భ‌రోసాయిచ్చే నాణ్య‌మైన‌ ఉన్న‌త విద్య కోసం భారీగానే ఖ‌ర్చు చేస్తున్నారు. విదేశాల్లో విద్యాభ్యాసం కోసం 2024-25లో మ‌న‌వాళ్లు చేసిన వ్య‌యం 9.6 బిలియన్ డాల‌ర్లుగా అంచ‌నా వేశారు. 2009-10లో ఈ వ్యయం 549 మిలియన్ డాల‌ర్లు. ఏడాదికి 21 శాతం పెరుగుద‌ల న‌మోద‌యింది. 

చ‌ద‌వండి: ప్ర‌పంచంలోనే ఎత్తైన భ‌వ‌నం.. బుర్జ్ ఖ‌లీఫా ఓన‌ర్ ఎవ‌రో తెలుసా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)