అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
Dallas: తెలుగు విద్యార్థులకు అండగా బీఆర్ఎస్
Published on Mon, 06/02/2025 - 09:58
డల్లాస్: అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు అండగా ఉంటామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. టెక్సాస్ స్టేట్లోని డల్లాస్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో(Telangana Formation Day) పాల్గొని ప్రసంగించారాయన.
డల్లాస్ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్(KTR) మాట్లాడుతూ..‘అసాధ్యం అనుకున్న రాష్ట్ర సాధనను ఢిల్లీ మెడలు వంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ సాకారం చేశారు. మూడేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. 2001లో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ స్వరాష్ట్ర సాధన కలగన్నాడు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహనీయుల స్పూర్తితో సకల జనులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించాడు. తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ నెరవేర్చారు.
జూన్ 2.. 60 ఏండ్ల కల నిజమైన రోజు!
దశాబ్దాల ఆశయాలు.. ఆశలు.. ఆకాంక్షలు.. కలలు ఫలించిన రోజు!
అసాధ్యాలను సుసాధ్యం చేయడమే తెలంగాణ స్టైల్. అసంభవం అనుకున్న ఎన్నో కార్యాలను సంభవం చేసి చూపించింది తెలంగాణ, దేశానికి దిక్సూచిగా మారింది.
దశాబ్దాలుగా స్థిరపడ్డ పెద్ద పెద్ద రాష్ట్రాలను… pic.twitter.com/LkVA8BXOZL— BRS Party (@BRSparty) June 2, 2025
.. నిన్నటి వరకు తెలుగు వాళ్ళకి రెండు రాష్ట్రాలే ఉన్నాయి అనుకున్నాను.. కానీ నాకు నిన్ననే అర్థం అయింది మనకి రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయని.. అది టెక్సాస్లో ఉంది. అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్(BRS Legal Cell) ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది’ అని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: అదే స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగించాలి: కేసీఆర్
Tags : 1