Breaking News

రష్యా కళాకారులపై మోదీ ప్రశంసలు : అక్కడి ఎన్‌ఆర్‌ఐలకు గుడ్‌ న్యూస్‌

Published on Tue, 07/09/2024 - 15:38

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారతీయులను కలిశారు. వారినుఉద్దేశించి ప్రసంగించారు. ప్రవాస భారతీయులతో పలు ప్రశ్నలడిగి, వారితో ఉత్సాహంగా  ముచ్చటించారు. తనకు స్వాగతం పలికేందుకు ప్రదర్శించిన రష్యన్ కల్చరల్ ట్రూప్ కళాకారులతో ప్రధాని  మోదీ సంభాషించారు.

మాస్కోలో భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి చేసే ప్రసంగానికి ముందు త్రివర్ణ పతాకాన్ని చేబూనిన భారతీయులు చప్పట్లు, "మోదీ మోదీ" నినాదాలతో  హోరెత్తించారు.  అనంతరం తన ప్రసంగంలో మోదీ  ఒక శుభవార్తను పంచుకున్నారు. రష్యాలో కొత్త కాన్సులేట్‌లను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. కజాన్, యెకటెరిన్‌బర్గ్‌లలో భారత కాన్సులేట్‌లను ప్రారంభించనున్నట్లు  తెలిపారు. ఇది పర్యాటకం, వ్యాపార వాణిజ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు.

ఎన్నాళ్లనుంచి డ్యాన్స్‌ నేర్చుకుంటున్నారని అని కళాకారులను ప్రధాని మోదీ ప్రశ్నించారు.  కొంతమంది పదేళ్లు, మరికొంతమంది 30 ఏళ్లు సమాధానమిచ్చారు.  కొంతమంది భారతదేశంతో, మోదీతో తమకున్న అనుభవాన్ని పంచుకున్నారు.   ఇస్కాన్ మాస్కో ప్రెసిడెంట్, సాధు ప్రియా దాస్, రామ్ కృష్ణ మిషన్ నుండి స్వామి ఆత్మలోకానంద తదితరులు మాట్లాడారు.

కాగా సోమవారం సాయంత్రం రష్యాలోని మాస్కోకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా ఉప ప్రధాని డెనిస్ మంత్రోవ్ స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన మోదీకి పుతిన్ ఘన స్వాగతం పలికారు మోదీపై పుతిన్‌  ప్రశంసల్లో ముంచెత్తిన సంగతి తెలిసిందే.

 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)