Breaking News

అమెరికాలో నల్లగొండ విద్యార్థిని అదృశ్యం

Published on Fri, 11/06/2026 - 10:07

కనగల్‌: నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం శాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కోయ యాదగిరిరెడ్డి, రూప దంపతుల ఏకైక కుమార్తె కోయ శ్రీజ (23) అమెరికాలోని బోస్టన్‌ నగరంలో అదృశ్యమయ్యారు. నవంబర్‌ 2వ తేదీ నుంచి ఆమె ఆచూకీ లభించకపోవడంతో బోస్టన్‌ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బోస్టన్‌లోని డోర్చెస్టర్‌ ప్రాంతంలో నివాసముంటున్న శ్రీజ నవంబర్‌ 2వ తేదీ రాత్రి సుమారు 9:45 గంటల సమయంలో ఎడిసన్‌ గ్రీన్‌ సమీపంలో చివరిసారిగా కనిపించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది.

 ఆ రోజు కాలేజీకి వెళ్లిన అనంతరం పార్ట్‌టైమ్‌ ఉద్యోగం ముగించుకుని తన గదికి చేరుకుంది. శ్రీజతో పాటు మరో ఎనిమిది మంది యువతులు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వారిలో ఓ యువతి పుట్టినరోజు వేడుకలకు శ్రీజను ఆహ్వానించగా, వస్తానని స్నేహితులకు చెప్పినట్లు బంధువులు పేర్కొన్నారు. అయితే వేడుకలకు స్నేహితులు ఏర్పాట్లు చేసుకుంటుండగా, కాసేపు సరదాగా వాకింగ్‌ చేసి వస్తానని చెప్పి బయటకు వెళ్లింది. 

ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో స్నేహితులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీజ వెళ్లిన తర్వాత ఆమె ఫోన్‌ సుమారు అర కిలోమీటరు పరిధి వరకు మాత్రమే నెట్‌వర్క్‌లో కనిపించిందని, ఆ తర్వాత స్విచ్ఛాఫ్‌ అయిందని తండ్రి యాదగిరిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం శ్రీజ ఎంఎస్‌ రెండో సంవత్సరం చదువుతోంది. మరో ఆరు నెలల్లో చదువు పూర్తికానుండగా ఇంతలోనే అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆమె కార్సన్‌ బీచ్‌ లేదా హార్బర్‌ పాయింట్‌ పరిసర ప్రాంతాల్లో ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం.  

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)