Breaking News

AMA తొలి భారతీయ ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్‌ ముక్కామల రికార్డ్‌, ఎవరీ ‘బాబీ’

Published on Fri, 06/13/2025 - 16:29

భారత సంతతికి చెందిన డాక్టర్‌ ముక్కామల శ్రీనివాస్‌ (Srinivas Mukkamala) అమెరికా వైద్యసంఘం ( AMA-American Medical Association) తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 179 సంవత్సరాల చరిత్రలో తొలిసారి ఎన్నికైన భారతీయ అధ్యక్షుడిగా శ్రీనివాస్ “బాబీ” ముక్కామల రికార్డు సృష్టించారు. ఇటీవలి AMA వార్షిక సమావేశంలో ఆయన180వ అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. ఇది అమెరికా వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని అందరూ ప్రశంసిస్తున్నారు.

ముక్కామల మిచిగాన్‌లోని ఫ్లింట్‌లో అనుభవజ్ఞుడైన ENT స్పెషలిస్ట్. రెండు దశాబ్దాలకు పైగా క్లినికల్ అనుభవం ఉన్న నిపుణుడు. ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చిన తల్లిదండ్రులకు 1972లో జన్మించారు. మెక్‌లారెన్ ఫ్లింట్ , హర్లీ మెడికల్ సెంటర్ వంటి అనేక ప్రముఖ ఆసుపత్రులతో ఆయనకు సంబంధం ఉంది. ఆయన మిచిగాన్ విశ్వవిద్యాలయ మెడిసిన్‌లో పట్టభద్రుడు. ఓటోలారిన్జాలజీ రంగంలో ఆయనకు మంచి పేరు ఉంది.

మరిన్ని ఎన్‌ఆర్‌ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్‌  చేయండి!

స్వయంగా కేన్సర్‌  సర్వైవర్‌
గత సంవత్సరం, ముక్కామలకు మెదడులోని టెంపోరల్ లోబ్‌లో 8-సెంటీమీటర్ల కణితి కనిపించింది. రోగ నిర్ధారణ జరిగిన మూడు వారాల తర్వాత హై-రిస్క్ సర్జరీ చేయించుకున్నారు.  ఈ ఆపరేషన్‌లో  90 శాతం కణితిని విజయవంతంగా తొలగించారు.ఆరోగ్య సంరక్షణ పట్ల అతని నిబద్ధతను బలోపేతం చేసేలా తాజా నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

తనకు ప్రపంచ స్థాయి చికిత్స అందినప్పటీ  లక్షలాది మందికి ఇలాంటి చికిత్సలో ఆలస్యం జరుగుతోందనీ, ఆర్థిక పరిమితులు, అనిశ్చితులను ఎదుర్కొంటున్నారని ముక్కామలకు హైలైట్ చేశారు. అలాగే చాలా మంది రోగులు తమ బీమా కవరేజీ వస్తుందా, లేదా  మందులకు ఎంత ఖర్చవుతుంది, ఔషధానికి ,నిపుణుడిని చూడటానికి ఎంతకాలం వేచి ఉండాలో అనే భయాలు వెంటాడుతున్నాయని అన్నారు. ఈ అనుభవం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తన దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని  శ్రీనివాస్‌ వెల్లడించారు. వైద్యుల హక్కులు, వనరుల కోసం పోరాడే వేదికగాఆధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు మార్గం వేయనుందనీ,  సమగ్ర ఆరోగ్య సంరక్షణకు, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ AMA ప్రాధాన్యతను పెంచుతుందని హామీ ఇచ్చారు. అలాగే AMA ప్రజారోగ్యంలో విస్తృతమైన సంస్కరణల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ముక్కామల అధ్యక్ష పదవిని చేపట్టడం విశేషం.  అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల ప్రమాదాలు, సరైన పోషకాహారం ప్రాముఖ్యత గురించిఅవగాహన పెంచడానికి అసోసియేషన్ ఇటీవల ఒక విధానాన్ని స్వీకరించింది.

ఇదీ చదవండి: అమెరికాలో వాల్‌మార్ట్‌లో అమ్మానాన్నలతో : ఎన్‌ఆర్‌ఐ యువతి వీడియో వైరల్‌

గతంలో ఏఎంఏ ఫౌండేషన్‌  నుంచి ఎక్సలెన్స్‌ ఇన్‌ మెడిసిన్‌ లీడర్‌షిప్‌ అవార్డు (Excellence in Medicine Leadership Award )ను ఆయన అందుకున్నారు. 2009లో ఏఎంఏ కౌన్సిల్‌ ఆన్‌ సైన్స్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2017 నుంచి  2021 వరకు ఏఎంఏ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్‌ బాబీ తల్లిదండ్రులు 1970ల్లో  ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు.
 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)