Breaking News

అమెరికా నుంచి 1,080 మంది భారతీయుల బ‌హిష్క‌ర‌ణ‌

Published on Fri, 05/30/2025 - 09:42

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు 1,100మంది ఇండియ‌న్స్  బహిష్కరణకు గురయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం తెలిపింది.వీరిలో 62 శాతం వాణిజ్య విమానాల ద్వారా తిరిగి వచ్చారన్నారు. ఆ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ మీడియాతో మాట్లాడుతూ అక్రమ వలసలకు సంబంధించి రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం కొనసాగుతుందని, అందుకే అక్రమ మార్గాల్లో అమెరికాలో ప్రవేశించిన వారిని మన దేశం వెనక్కి ర‌ప్పిస్తుంద‌ని  చెప్పారు.

1,080 మంది భారతీయులు అమెరికా నుంచి  స్వదేశానికి చేరుకున్నారని  రణదీర్‌ జైశ్వాల్‌ తెలిపారు. చట్టవిరుద్ధంగా  అమెరికా వెళ్లిన భారతీయ పౌరులను బహిష్కరించే విషయంలో... వారి గురించి పూర్తి వివరాలు అందిన తర్వాత అన్ని విష‌యాలు ధ్రువీక‌రించుకున్న తరువాతనే వారిని తిరిగి స్వ‌దేశానికి ర‌ప్పిస్తున్నాం. గతంలోనే చెప్పినట్లుగా వారి జాతీయతను ధృవీకరించిన ర్వాత మాత్రమే వారిని తిరిగి ఇండియాకు తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తామని ఆయన  చెప్పారు. ఈవిషయంలో భారత్‌ అమెరికాల మధ్య సన్నిహిత సహకారం ఉందన్నారు. స్టూడెంట్ , ఎక్స్ఛేంజ్ విజిటర్ వీసా దరఖాస్తుదారులపై  అమెరికా ప్రభుత్వ మార్గదర్శకత్వం గురించి వచ్చిన నివేదికలను కూడా జైస్వాల్ ప్రస్తావించారు. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, విదేశాలలో ఉన్న భారతీయ విద్యార్థుల సంక్షేమంపై దృష్టిపెట్టినట్టు వివరించారు.

అలాగే తప్పిపోయిన ముగ్గురు భార‌తీయుల కోసం ఇరాన్‌తో సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఈ ముగ్గురి కుటుంబ సభ్యులకు మంత్రిత్వ శాఖ అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని రణధీర్‌ జైశ్వాల్‌ వివరించారు.
 

Videos

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు