Breaking News

అమెరికాలో కర్నాటక విద్యార్థి అదృశ్యం 

Published on Sat, 02/14/2026 - 12:55

న్యూయార్క్‌/బెంగళూరు: అమెరికాలోని కాలిఫోరి్నయాలో పీజీ చదువుకునే భారతీయ విద్యార్థి ఒకరు కనిపించకుండా పోయారు. కర్నాటకకు చెందిన సాకేత్‌ శ్రీనివాసయ్య(22) అమెరికాలోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ బర్కిలీలో కెమికల్, బయోమాలిక్యులర్‌ ఇంజనీరింగ్‌ పీజీ చేస్తున్నాడు. మద్రాస్‌ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్‌ ఇంజనీరింగ్‌ పట్టా అందుకున్నాడు. సాకేత్‌ మంగళవారం చివరిసారిగా డ్వైట్‌ వేలోని 1700 బ్లాక్‌ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్‌టాప్, పాస్‌పోర్టు తదితరాలున్న సాకేత్‌ బ్యాగు లేక్‌ ఆంజా ప్రాంతంలోని పార్క్‌హిల్స్‌లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు.

 ఈ విషయాన్ని శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ ధ్రువీకరించింది. సాకేత్‌ అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. అతడి ఆచూకీ కనుగొనే విషయమై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, కర్నాటకలోని కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని శనివారం వెల్లడించింది. ఈ నెల 9వ తేదీ నుంచి సాకేత్‌ కనిపించకుండాపోయాడంటూ అతడి రూమ్మేట్‌ బనీత్‌ సింగ్‌ ఈ నెల 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని చోట్లా వాకబు చేసిన తను ఎటువంటి ఫలితం కనిపించకపోవడంతో పోలీసులకు తెలిపినట్లు బనీత్‌ తెలిపాడు. 

ప్రభుత్వానికి సాకేత్‌ తండ్రి వినతి 
అమెరికాలో గల్లంతైన తమ కుమారుడిని కనుగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన అందజేసినట్లు తండ్రి శ్రీనివాసయ్య తెలిపారు. చివరిసారిగా తమ కుమారుడితో ఈ నెల 9వ తేదీన ఫోన్‌లో మాట్లాడామన్నారు. 12వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ అతడి రూమ్మేట్‌ తమకు తెలిపాడన్నారు. కుమారుడి కోసం అమెరికా వెళ్లే విషయమై తాము ఆలోచిస్తున్నామన్నారు. సాకేత్‌ విషయంలో కాలిఫోర్నియాలోని భారత కాన్సులేట్‌ అధికారులు అక్కడి పోలీసులతో మాట్లాడాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కర్నాటక ప్రభుత్వం శనివారం కేంద్ర విదేశాంగ శాఖను కోరింది.   

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు