Breaking News

27 ఏళ్లకే కోటీశ్వరుడై ఆస్పత్రి పాలయ్యాడు..ఆపై అద్బుతం చేశాడు!

Published on Mon, 10/05/2026 - 17:36

వ్యవస్థాపకులుగా మారడం అంటే..మాములు ఒత్తిడిని ఉండదు. పారిశ్రామికవేత్తలుగా మారాలని కలలు కనే యువత అంతా ఈ భయానక ఒత్తిడి, టెన్షన్లను ఎదుర్కొంటుంటారు. ఆ క్రమంలో కొందరు ఆరోగ్యాన్ని మొత్తం నాశనం చేసుకుంటుంటే..ఒక్కరే ఇద్దరే ముందుగా మేల్కోని ఆరోగ్యవంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కెరీర్‌లో ఎదుగుదల మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ప్రధానమే అంటూ ఈ పారిశ్రామికవేత్త తన అనుభవాన్ని పంచుకున్నారు ఇలా. 

ఆయనే భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త రాహుల్‌ వోహ్రా. ఇంగ్లాండ్‌లో బర్మింగ్‌హామ్‌లో పెరిగిన వోహ్రా 2009లో రాపోర్టివ్‌ సహ స్థాపించారు. ఈ కంపెనీ ఈమెయిల్‌ కాంటాక్ట్‌ల గురించి సమాచారాన్ని జోడించి బ్రౌజర్‌ ప్లగ్‌ ఇన్‌ను అభివృద్ది చేసింది. దీన్ని ఫిబ్రవరి 2012లో లింక్డ్‌ఇన్‌ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు నిజంగా అతడి కెరీర్‌కి పెద్ద విజయమే. ఎందుకంటే తీంతో అతడు 27 ఏళ్లకే కోటీశ్వరుడయ్యాడు.  కానీ ఆ కొనుగోలు అతడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. 

అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ దాదాపు వ్యాయామం చేయకుండా ఒక స్టార్టప్‌ను నడపడంలో మునిగిపోయి..తీవ్రమైన ఒత్తిడిని ఏళ్ల తరబడి ఎదుర్కొన్నారు. అయితే తాను ఒత్తిడికి గురవ్వుతున్నాననే విషయాన్ని గమనించకుండా అలానే వర్క్‌ చేసుకుంటూ పోవడంతో ఉన్నట్టుండి వికారం, అసౌకర్యానికి గురయ్యాడు. అలా మధ్యాహ్న భోజన సమయానికి ఈ వికారం, అసౌకర్యం మరింత తీవ్రతరం దాల్చి..ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 

ఒక సహ వ్యవస్థాపకుడు సకాలంలో అసౌకర్యాన్ని తగ్గించే మందులు ఇచ్చి సహాయం చేశారు. ఆ తర్వాత అతను యథవిధిగా పనిని కొనసాగించాడు. అయితే ఆ మరుసటి రోజుకి వోహ్రా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే..దీర్ఘకాలిక ఒత్తిడి బారినపడ్డట్లు నిర్థారించారు. అందుకు తన అస్తవ్యస్థమైన జీవనశైలి అలవాట్లే కారణమని వైద్యులు చెప్పడంతోనే తనకు కనువిప్పు కలిగిందన్నారు. తనలా 20 ఏళ్ల వయసులో ఉన్న వ్యవస్థాపకులంతా ఎక్కువ పనిగంటలతో ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

పైగా దాన్ని గౌరవ చిహ్నంగా చూస్తున్నారని అన్నారు. వోహ్రా సుమారు వారం రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని, ఆ తర్వాత పూర్తిగా కోలుకునేలా కుటుంబంతోనే గడిపారు. ఆ సమయంలోనే ఆరోగ్యాన్ని పణంగా పెట్టకుండా కంపెనీలను ఎలా నిర్మించాలనే దానిపై ఆలోచంచడం ప్రారంభించారు. ఆ క్రమంలో వచ్చిన ప్రధాన మార్పు ధ్యానం. ఆయన రాజ్‌ సంప్రదాయం ద్వారా ధ్యానాన్ని అభ్యసించడం ప్రారంభించి, దాన్ని తన దినచర్యలో ఒక భాగం చేసుకున్నారు. 

ఆయన ఇప్పుడు తన ఉదయాన్ని 30 నిమిషాల ధ్యానంతో ప్రారంభిస్తారు. అలాగే పని సమయంలో విరామం తీసుకుంటుంటారు. అలా చివరకు తన పనిలోకి తిరిగి వచ్చి..తనను ఎంతగానో ఇబ్బందిపెట్టే వెంచర్‌ క్యాపిటలిస్టుల(వీసీలు)తో చర్చించడం మానుకుని..కొత్తశక్తితో ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతగా ఉండటం ప్రారంభించారు. అయితే తనను మళ్లీ వ్యవస్థాపకుడిగా మారకుండా మాత్రం ఈ అనారోగ్య భయం ఆపలేకపోయిందన్నారు. 

అలా 2014లో కాన్రాడ్ ఇర్విన్, వివేక్‌ సోడెరాలతో కలిసి 'సూపర్‌హ్యూమన్'ను సహ-స్థాపించి, ఈమెయిల్ సాఫ్ట్‌వేర్ రంగంలోకి తిరిగి వచ్చారు. సూపర్‌హ్యూమన్ భారీ విజయాన్ని సాధించి, 2021లో ఏకంగా రూ. 8 వేల కోట్లకు అమ్ముడుపోయింది. దీన్ని గ్రామర్లీ ఈ కంపెనీ కొనుగోలు చేసింది. కానీ ఈసారి మాత్రం ఈ కంపెనీ కొనుగోలులో ఒత్తిడి ఎదుర్కొనలేదు, అనారోగ్యం బారినపడలేదు. ఎందుకంటే తన ఆహారపు అలవాట్లను మార్చుకోవడమే కాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేశారు. ధ్యానం కోసం సమయం కేటాయించారు. అలాగే పోషకాహార నిపుణులు, కోచ్‌లు ఇతర నిపుణుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. 

ఇక ఆయన స్థాపించి తొలి స్టార్టప్‌ రాపోర్టివ్‌తో పోలిస్తే..సూపర్‌హ్యుమన్‌కు గణనీయంగా ఎక్కువ ఆర్థిక స్థిరత్వం ఉంది. ఈ కంపెని పెట్టుబడిదారుల నుంచి దాదాపు రూ. 900 కోట్లకు పైగా నిధులను సమీకరించింది. తొలి విజయంలో ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం అనే మూల్యం చెల్లిస్తే..ఆ తర్వాత అంతే శక్తిమంతంగా తిరిగొచ్చి ఫిట్‌గా ఉంటూనే వ్యవస్థాపకుడి ఎలా పనిచేయొచ్చే చూపించి స్ఫూర్తిగా నిలిచారు పారిశ్రామికవేత్త వోహ్రా.

ఇదీ చదవండి: చాయ్‌ వ్యాపారంతో అన్ని కోట్లా..!ఆ ముగ్గురు కుర్రాళ్ల ఐడియా..)

 

Videos

నిన్నే అడుగుతున్న... పెనుకొండలో ఉషశ్రీ చరణ్ భారీ ధర్నా

రజినీతో క్లాష్ మిస్... దుల్కర్ తో క్లాష్ ఫిక్స్..

జూలైలోనే విమానం కూల్చేందుకు కుట్ర... సంచలన విషయాలు

రాయలసీమ ద్రోహి చంద్రబాబు

YSRCP నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి కుట్ర

బాల్కనీ నుంచి జారిన చిన్నారి.. చివరి క్షణంలో ఎలా కాపాడాడంటే!

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో డెలివరీ బాయ్‌పై భార్యాభర్తల దాడి

ఫ్యాన్ కోసం సెక్యూరిటీని లెక్కచేయని ధావన్

తాట తీస్తాం చుట్టమల్లే డీప్ ఫేక్ పై నాగవంశీ వార్నింగ్

రాజకీయ ప్రయాణం బుక్ స్థితప్రజ్ఞుడు YS జగన్..

Photos

+5

మూవీ రిలీజ్ తర్వాత మళ్లీ ట్రెండింగ్‌లో నక్షత్ర (ఫొటోలు)

+5

ఎం.ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్.. రష్మిక ఎమోషనల్ పోస్ట్ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్ కళ్యాణ్’మూవీ హీరోయిన్ మహిమ నంబియార్ (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ 'దేశీ గర్ల్' లుక్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్ : ఏపీలో ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలు...(ఫొటోలు)

+5

టెన్నిస్‌ కోర్టులో నటి వర్ష డిసౌజా.. (ఫొటోలు)

+5

రష్మిక రణబాలి లుక్‌.. అదిరిపోయిన స్టిల్స్(ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ భారత క్రికెటర్‌ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : దుర్గామాతకు జైకొడదాం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : సందడిగా దక్కన్‌ డెర్బీ మీట్‌ (ఫొటోలు)