నన్ను టార్చర్‌ చేస్తున్నారు.. స్వదేశానికి తీసుకెళ్లండి!

Published on Mon, 07/20/2026 - 08:39

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీ పహాడీషరీఫ్‌ నుంచి బతుకుతెరువు కోసం ఒమన్‌ వెళ్లిన మహిళ షబ్నం బేగంకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఏజెంట్‌ చెప్పినట్లు అక్కడ జరగకపోవడంతో పాటు పగలూ రాత్రీ తేడా లేకుండా పని, హింస ఎదుర్కొంది. దీంతో యజమాని నుంచి తప్పించుకుని అక్కడి భారత ఎంబసీకి చేరిన షబ్నంబేగం తనను రక్షించాలంటూ నగరానికి చెందిన ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్‌కు సెల్ఫీ వీడియో పంపింది. దీన్ని ఆయన తన ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా ఒమన్‌లోని భారత ఎంబసీతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) దృష్టికి తీసుకువెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

షబ్నం సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. ‘నా పేరు షబ్నంబేగం. మార్చి 26న ఏజెంట్‌ ద్వారా ఒమన్‌ వచ్చా. ఉద్యోగం పేరుతో ఇక్కడకు పంపాడు. ఇక్కడ పగలు–రాత్రి పని చేయిస్తున్నారు. మూడు నెలలుగా జీతం ఇవ్వట్లేదు. కనీసం మొబైల్‌ ఫోన్‌ కూడా అందుబాటులో ఉండనీయట్లేదు. నాకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరంతా చిన్న పిల్లలు. ఇక్కడ నా యజమానులు చాలా టార్చర్‌ చేస్తున్నారు. సరిగా తిండి కూడా పెట్టకుండా వేధిస్తున్నారు. తరచూ కొడుతుండటంతో తట్టుకోలేక పారిపోయి ఒమన్‌లోని ఇండియన్‌ ఎంబసీకి వచ్చి ఎనిమిది రోజులుగా తలదాచుకున్నా. ఇక్కడ ఇలా 130 మంది మహిళలం ఉన్నాం. ఏజెంట్‌ నా పాస్‌పోర్టు తీసుకుని తిరిగి ఇవ్వట్లేదు. దయచేసి నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్లండి’ అంటూ వేడుకున్నారు. షబ్నం బేగంను వెంటనే హైదరాబాద్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ను ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్‌ కోరారు. మాయ మాటలతో మోసం చేసిన ఏజెంట్‌ పైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)