Breaking News

వందలాది భారతీయుల డ్యాన్సింగ్‌ వీడియో : దుమారం, అసలు ట్విస్ట్‌ ఇదీ!

Published on Fri, 06/05/2026 - 17:34

కెనడాలోని రద్దీగా ఉండే టొరంటో వీధుల్లో వందలాదిమంది భారతీయులు నృత్యం చేసిన ఘటన, దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా భారతదేశపు వలసరాజ్యం లా మారిపోతోంది అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ వీడియో ఆన్‌లైన్‌లో అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ముఖ్యంగా కెనడా స్థానికులు మాత్రం దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా జరగనివ్వమని స్థానికులు షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు ఒక చర్చకు దారితీసింది.

ఒక యూజర్ వివాదాస్పదమైన క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేయడంతో వివాదం మొదలైంది. కెనడా ఇప్పుడు భారతీయ వలసరాజ్యంగా మారిపోయింది. టొరంటోలో కెనడియన్లే ఇప్పుడు మైనారిటీలుగా మారిపోతున్నారు. వలసవచ్చిన వారి సంఖ్య గతంలో కంటే మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోయింది. దీనిని మనం ఇలాగే వదిలేయ కూడదు. కెనడియన్లారా, ఇప్పటికైనా మేల్కోండి అంటూ  ఎక్స్‌లో షేర్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.  అంతేకాదు  రాబోయే కొద్ది సంవత్సరాల్లో కెనడాలోని 'బ్రాంప్టన్' నగరం పూర్తిగా భారతీయ మూలాలున్న వారితో నిండిపోయి, వారే మెజారిటీగా మారే నగరంగా రూపాంతరం చెందుతుంది. ఇది కెనడాపై జరుగుతున్న థర్డ్ వరల్డ్ (మూడో ప్రపంచ దేశాల) ఆక్రమణ అంటూ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.

 


నెటిజన్ల స్పందన
కల్చర్ మిస్ అవుతోంది, అసలు ఇది కెనడానా లేక ఇండియా అర్థం కావడం లేదు. కెనడా తన సొంత సంస్కృతిని కోల్పోతోంది. వలస వచ్చిన వారు ఇక్కడి సంస్కృతిని, పద్ధతులను గౌరవించాలంటూ ఒకరు అసహనం వ్యక్తం చేశారు.  మరికొంతమంది ఇండియన్స్‌కు మద్దతుగా నిలిచారు. భారీగా పన్నులు చెల్లిస్తూ, కీలకమైన ఉద్యోగ కొరతను తీర్చే వలసదారుల కష్టంతోనే కెనడాఎదుగుతోందని విమర్శించారు. .మరికొందరు  ఈ వేడుకల వల్ల ఎవరికి నష్టం జరిగింది.   ప్రజలు ఆనందంగా గడపడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: రొటీన్‌ లైఫ్‌ బోర్‌ కొట్టి రెండు ఉద్యోగాలు : బైక్‌ రైడ్స్‌తో రోజుకు రూ. 1500

మరోవైపు విదేశాల్లో భారతీయుల వ్యవహార శైలిపై కొంతమంది  భారతీయులు విమర్శించారు. ఇది భారతీయ సంస్కృతీ కళ కానే కాదు. ఇది ఒక చౌకబారు బాలీవుడ్ రీల్స్‌ స్టంట్‌ అంటూ మండిపడుతూ  ఆశిస్ బసు ట్వీట్ చేయగా, స్థానిక సంస్కృతిలో కలిసి పోకుండా విదేశాలలో తమ మాతృదేశ  సంప్రదాయాలను ఎందుకు అనుకరిస్తున్నారని ప్రశ్నిస్తూ తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. కొంతమందైతే, ఇటువంటి వేడుకలను పూర్తిగా నిషేధించాలని కూడా డిమాండ్ చేశారు.

ట్విస్ట్‌  ఏంటంటే..
ఇది 2024 నాటి వీడియో. కానీ రెండు సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డ్యాన్స్ వీడియో  కామెంట్ సెక్షన్ మొత్తం జాతి వివక్షాపూరిత దూషణలతో నిండిపోయింది.

 

ఇదీ చదవండి: ప్రముఖ హాలీవుడ్‌ నటుడి దారుణ హత్య : ప్రియురాలి కొడుకు అరెస్ట్‌

Videos

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు